RRR ని ప్ర‌త్యేకంగా వీక్షించిన అవ‌తార్ డైరెక్ట‌ర్‌!

Update: 2023-01-16 05:42 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండ‌ర్ 'RRR '. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల తొలి క‌ల‌యిక‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఇది. దేశ వ్యాప్తంగానే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గానూ ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టించింది. ఏ ముహూర్తాని ఏ ల‌క్ష్యంతో ఈ మూవీకి రాజ‌మౌళి శ్రీ‌కారం చుట్టాడో గానీ ఆ ల‌క్ష్యం నెర‌వేర‌డ‌మే కాకుండా అద‌న‌పు ల‌క్ష్యాల‌ని కూడా సాధిస్తూ ద‌ర్శ‌కుడిగా ఊహించ‌ని శిఖరాల‌కు రాజ‌మౌళిని చేరుస్తూ సంచల‌నం సృష్టిస్తోంది.

వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1200 కోట్ల‌కు మించి వసూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన ద‌గ్గ‌రి నుంచి యావ‌త్ హాలీవుడ్ దిగ్గ‌జాల‌ని సైతం అబ్బుర ప‌రుస్తూ ఇండియ‌న్ సినిమా.. అందులోనూ టాలీవుడ్ సినిమా స‌త్తా ఏంటో యావ‌త్ ప్ర‌పంచానికి, హాలీవుడ్ స్టార్స్ ని తెలియజేస్తూ వ‌రుస సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌లు అవార్డుల్ని ద‌క్కించుకుంటూ దూసుకుపోతున్న RRR రీసెంట్ గా హాలీవుడ్ స్టార్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని సొంతం చేసుకుని చ‌రిత్ర సృష్టించింది.

ఇండియా నుంచి ఈ అవార్డుని ద‌క్కించుకున్న రెండ‌వ సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. ఇదిలా వుంటే ఇటీవ‌ల అవార్డుని ద‌క్కించుకున్న త‌రువాత చిత్ర బృందం పై హాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌త్యేకంగా క‌లిసి చిత్ర బృందంపై , ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్ లో ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడిగా పేరు గాంచిన ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ ని రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా క‌లవ‌డం తెలిసిందే.

స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి దేవుడితో పోల్చి కీర‌వాణితో క‌లిసి ఆయ‌న‌తో దిగిన ఫొటో రాజ‌మౌళి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా మ‌రో దిగ్గ‌జ హాలీవుడ్ బ్ర‌హ్మ జేమ్స్ కెమెరూన్ ని క‌ల‌వ‌డం, ఆయ‌న‌తో ప‌ది నిఇషాల పాటు రాజ‌మౌళి మాట్లాడటం విశేషం. ఇదే విష‌యాన్ని తాజాగా రాజ‌మౌళి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఆయ‌న‌తో క‌లిసి వున్న ఫొటోల‌ని షేర్ చేశారు.

'గ్రేట్ జేమ్స్ కెమెరూన్ RRR సినిమా చూశారు. సినిమాను ఆయ‌న ఎంత‌గానో ఇష్టప‌డ్డారు. త‌న భార్య సుజీకి రిక‌మెండ్ చేసి త‌న‌తో క‌లిసి మ‌రోసారి చూశారు. నాతో ప‌ది నిమిషాల పాటు సినిమా గురించి విశ్లేషిస్తూ చ‌ర్చించ‌డం ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నా. ధ‌న్య‌వాదాలు' అంటూ త‌న ఆనందాన్ని పంచుకున్నారు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News