జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్-2'-' ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న విజువల్ వండర్ ఇది. దశాబ్ధ కాలంగా ప్రేక్షకాభిమానులు ఎంతో ఎగ్జటైమెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చేసింది. మరో మూడు నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో అంచనాలకు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.
కామెరూన్ ఎలాంటి విజువల్ ట్రీట్ ని అందించబోతున్నారు? అన్న ఉత్సాహం ఉరకలేస్తుంది. ది వే ఆఫ్ వాటర్ లో ఎంతటి అద్భుత సృష్టికి తెర తీసారు? అంటూ ఒకే చర్చ సాగుతోంది. అయితే అంతకు ముందే మరోసారి థియేటర్లో అవతార్ రీ-రిలీజ్ చేస్తున్నారు. సినిమాకి కొత్త మెరుగులు దిద్ది సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్నారు.
అప్పట్లో ఇదే చిత్రాన్ని 3డీలో చూసి ఆస్వాదించారు. ఇప్పుడిదే చిత్రాన్ని 4కె ఫార్మెట్ లో కి మార్చి హై డైనమిక్ రేంజ్లో తీర్చిదిద్దారు. ప్రతీ ప్రేమ్ సరికొత్త అనుభూతిని పంచేలా మలిచినట్లు యూనిట్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో నటించిన నటులు కొత్త వెర్షన్ చూసి వావ్ అంటారని కామెరూన్ నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
3డీ-2డీ ఫార్మెట్ లో రిలీజ్ అయిన అవతార్ అప్పట్లో వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 4 కెఫార్మెట్ సైతం మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి. అయితే 'అవతార్ -2' రిలీజ్ ముందు అవతార్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక మరో బలమైన కారణం కూడా కనిపిస్తుంది. 'అవతార్' రిలీజ్ అయి 13 సంవ్సతరాలు అవుతుంది.
అప్పటి నుంచి రెండవ భాగాన్ని పూర్తిచేసి రిలీజ్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ రకంగా చాలా గ్యాప్ ఏర్పడింది. ఒక్కసారి అవతార్ మధుర స్మృతులను స్మరించుకుని అవతార్ -2లోకి వెళ్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
అప్పుడు థియేటర్లో అవతార్ ని మిస్సైన వారంతా మళ్లీ థియేటర్లో చూసే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఆ కథకి కొనసాగింపు కథ కాబట్టి ఎగ్జైట్ మెంట్ రెట్టింపు అవుతుంది. మొదటి భాగం పండోరా అనే గ్రహాన్ని సృష్టించి కథ అంతా అక్కడే నడిపారు. ఈ నేపథ్యంలో మలిభాగం కోసం ఏకంగా నీటి గర్భంలోనే అద్భుతమైన సృష్టికి తెర తీసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.