రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అవెంజర్స్ : ఎండ్ గేమ్' రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు 15,302 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రం 'అవతార్' రికార్డులను బ్రేక్ చేస్తుందని భావించారు. అయితే అవతార్ వద్దకు వెళ్లలేక పోయినా కూడా 'టైటానిక్' రికార్డులను మాత్రం బద్దలు కొట్టేసింది. 1997 సంవత్సరంలో వచ్చిన టైటానిక్ చిత్రం అప్పట్లోనే 15 వేల కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అవెంజర్స్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
టైటానిక్ రికార్డును అవెంజర్స్ : ఎండ్ గేమ్ బ్రేక్ చేసిన నేపథ్యంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన టైటానిక్ సినిమా వసూళ్లను అవెంజర్స్ చిత్రం బ్రేక్ చేసిందని జేమ్స్ కామెరూన్ అన్నాడు. నిజమైన టైటానిక్ ఓడను ఓ ఐస్ బర్గ్ ముంచి వేస్తే, ఇప్పుడు నా టైటానిక్ ను మీ అవెంజర్స్ ముంచేసిందని మార్వెల్ సంస్థను ఉద్దేశించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ అన్నాడు.
మా నిర్మాణ సంస్థ లైట్ స్టోర్మ్ ఎంటర్ టైన్ మెంట్ సిబ్బంది మీ విజయానికి సెల్యూట్ చేస్తున్నారు అంటూ ఆసక్తికర పిక్చర్ ఒకటి పోస్ట్ చేశాడు. అందులో టైటానిక్ ఓడను అవెంజర్స్ లోగో ముంచి వేస్తున్నట్లుగా ఉంది. జేమ్స్ కామెరూన్ స్ఫూర్తిదాయకంగా తన సినిమా రికార్డు బ్రేక్ చేసిన సినిమాపై ప్రశంసలు కురిపించడంతో ఆయన తన స్థాయిని మరింతగా పెంచుకున్నాడు. టైటానిక్ చిత్రం రికార్డు బ్రేక్ చేసిన అవెంజర్స్ 'అవతార్' కు మాత్రం కాస్త దూరంలో ఉండిపోయింది.