ఈ శుక్రవారం రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్: ఎండ్ గేమ్' బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. మొదటి మూడు రోజలలో 'అవెంజర్స్' ఇండియా వసూళ్లు రూ.157 కోట్లు. మొదటి మూడు రోజులు యాభై కోట్లకు పైగా రోజువారీ కలెక్షన్స్ సమోదు చేసిన ఈ చిత్రం సోమవారానికి మాత్రం డ్రాప్ అయింది.
ఎలాంటి సినిమాకైనా సోమవారం వసూళ్లు మందగించడం కామనే. అయితే అవెంజర్స్ కు మాత్రం ఇండియా వసూళ్ళలో నలభై శాతం డ్రాప్ కనిపించింది. ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం సోమవారం రూ.31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో అవెంజర్స్ కలెక్షన్స్ చూస్తే.. హైదరాబాద్ తప్ప మిగతా అర్బన్ ఏరియాలు అన్నిటిలో కలెక్షన్స్ సాధారణంగానే ఉన్నాయి. మొదటి వీకెండ్ లో ఉన్న ఊపు మాత్రం కొనసాగలేదు.
ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల ప్రకారం 'అవెంజర్స్' నాలుగు రోజుల ఇండియా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
శుక్రవారం: 53.60 cr
శనివారం: 52.20 cr
ఆదివారం: 52.85 cr
సోమవారం: 31.05 cr.
టోటల్: రూ. 189.70 cr నెట్ కలెక్షన్స్
సోమవారం ఇలా 'అవెంజర్స్' కలెక్షన్స్ జోరు తగ్గడం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం థియేటర్లలో ఉన్న తెలుగు సినిమాలకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.