ఆ హీరోస్ కి అనవసరంగా భయపడ్డారు

Update: 2019-05-07 10:39 GMT
గత నెల 26న అవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి మూడు రోజుల ప్రభంజనం చూసి తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్ని రికార్డులు బద్దలవుతాయో అని అనుకున్నరందరూ. కొన్ని సినిమాల విడుదల ఏకంగా వాయిదా కూడా వేసుకున్నారు. లేకపోతే 1వ తేది అర్జున్ సురవరంతో పాటు అభినేత్రి 2 కూడా ధియేటర్లలో వచ్చేసేవి. కాని జరిగింది వేరు.

అవెంజర్స్ ప్రభావం కేవలం మొదటి వారానికే పరిమితమయ్యింది. ముఖ్యంగా జిల్లా కేంద్రాలతో పాటు చాలా బీసి సెంటర్స్ లో పాతిక శాతం ఆక్యుపెన్సీ లేక మహర్షి రీ ప్లేస్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ పైన చెప్పిన రెండు సినిమాల్లో ఏది వచ్చినా ఖచ్చితంగా దాన్నే వేసుకునే వాళ్ళు. ఒక వారం రోజులు సేఫ్ రన్ వాటి దక్కేదని ట్రేడ్ మాట

అవెంజర్స్ ఎండ్ గేమ్ మీద క్రేజ్ పీక్స్ లో ఉన్న మాట నిజమే కాని మరీ ప్రాంతీయ సినిమాలు భయపడే రేంజ్ కాదని రుజువైపోయింది. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ మరీ కొందరు ట్రేడ్ అనలిస్టులు డబ్బా కొట్టినట్టు బాహుబలిని దాటే సీన్ లేదని అర్థమైపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే టైటానిక్ ని దాటేసి అవతార్ రికార్డులపై కన్నేసిన సూపర్ హీరోస్ ఇండియాలో మాత్రం తమ జోరును బాగా తగ్గించేశారు. ఒకరకంగా ఇది మహర్షికి మరో అదనపు ప్లస్ అవుతుంది. మెయిన్ సెంటర్స్ తప్ప ఈ ఎండ్ గేమ్ స్క్రీన్లన్ని మహర్షినే తీసుకోబోతున్నాడు. సో ఊహించిన దాని కన్నా అవెంజర్స్ దూకుడు త్వరగానే ముగింపుకోస్తోంది
    

Tags:    

Similar News