`ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఇక్కడ ఆశించినంత సాఫీగా సాగలేదు. తొలి సినిమాతో మంచి పెర్పార్మర్ గా నిరూపించుకున్నా అటుపై వచ్చిన అవకాశాలేవీ అమ్మడికి పెద్ద పీట వేయలేకపోయాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం.. ఆన్ స్క్రీన్ మసాలా సన్నివేశాలకు నో చెప్పడం వంటి కారణాల వల్ల దర్శక నిర్మాతలు అవికను పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. దీనికి తోడు బరువు పెరగడంతో కొంత డిప్రెషన్ లోకి వెళ్లాల్సొచ్చింది. కానీ ఇంతలోనే స్లిమ్ లుక్ కోసం అవిక చేసిన ప్రయత్నం ఫలించింది. ఇటీవల ఈ బ్యూటీ అల్ట్రా స్లిమ్ లుక్ యువతరంలో గుబులు పెంచుతోంది. అవిక వరుస ఫోటోషూట్లు హీట్ పెంచుతున్నాయి. ఇటీవలే అవిక నటించిన `నెట్` అనే సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. థాంక్యూలో అవిక రెండో నాయిక. నాగచైతన్య హీరోగా నటిస్తుండగా రాశీఖన్నా మెయిన్ లీడ్ లో కనిపిస్తుంది. విక్రమ్. కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాట్టి నటనకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా అవిక స్కిన్ టైట్ డ్రెస్ లతో ఫోటోషూట్ లో దూకుడు పెంచింది. బికినీ షూట్ తరహాలో చాలా రచ్చ చేసింది.
ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పింక్ లుక్ లో కనిపించింది. `గ్రాండియర్ లైఫ్ స్టైల్` కవర్ పేజీ కోసం అవికా రకరకాలుగా ఫోజులిచ్చింది. టాప్ లో పింక్ కలర్ షోల్డర్ లెస్ స్కిన్ టైట్ దుస్తుల్ని దరించింది.. అలాగే థై స్లిట్ బాటమ్ తో అగ్గి రాజేసింది. ప్రస్తుతం అవికా ఆశలన్నీ టాలీవుడ్ పైనే ఉంది. ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలు రిలీజ్ అయితే విజయాలు దక్కితే తప్ప మరో ఛాన్స్ కష్టంగానే కనిపిస్తోంది.