నా కుటుంబం కోవిడ్ తో యుద్ధం చేసింద‌న్న అవిక‌

Update: 2021-04-28 03:31 GMT
కొన‌సాగుతున్న మ‌హ‌మ‌మ్మారీ వ‌ల్ల ఆస్ప‌త్రుల్లో రోగుల‌కు ప్లాస్మా కొర‌త బెడ్ల కొర‌త భ‌య‌పెడుతోంది. అయితే ఈ ప‌రిస్థితిపై సెల‌బ్రిటీలు స్పందిస్తున్నారు. అభిమానుల్ని సాయం కోరుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు క‌థానాయిక‌లు హీరోలు ప్లాస్మాను దానం చేయాల‌ని సోష‌ల్ మీడియాల్లో అభ్య‌ర్థించ‌గా దానికి ప్ర‌యోజ‌నం క‌నిపిస్తోంది.

తాజాగా యువ‌క‌థానాయిక అవికా గోర్ ఇన్ స్టా వేదిక‌గా క‌రోనా రోగుల‌కు సాయం కోరుతూ ఒక సందేశం ఇచ్చారు.  విరివిగా ప్లాస్మాను దానమిచ్చి ప్రాణాలను కాపాడాల‌ని కోరారు. తన అభిమానుల అనుచరుల దృష్టిని ఆకర్షించడానికి ఇన్ స్టాలో కొన్ని అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేసారు. సెకండ్ వేవ్ తో పోరాడుతున్న భార‌త‌ దేశం గురించి.. పౌరులందరూ ముందుకు వచ్చి తమ వంతు రోగుల కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన సాయం చేయడం ఎంత‌ ముఖ్యమో ఆమె ఒక సుదీర్ఘ నోట్ రాశారు.

అంతేకాదు.. అవిక‌ కుటుంబం కూడా వైరస్ తో పోరాడి ప్రాణాలతో బయటపడిందని తెలిపారు. అవికా ఇంకా ఏమ‌ని అంది అంటే.. “నా కుటుంబం యుద్ధంలో పోరాడింది. అది ఆహ్లాదకరమైన అనుభూతి కాదు.  భయానకంగా ఉంది. వారు బయటపడినందుకు నేను సంతోషిస్తున్నాను. కానీ ఎవరైనా దాని గుండా వెళ్లాలని నేను కోరుకోను” కోవిడ్ -19 నుండి బయటపడిన వారంతా ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాలని అవిక‌ అభ్యర్థించారు. ఆమె నోట్ ఇలా ఉంది. “యుద్ధం చేసి గెలిచిన వారికి దయచేసి ప్లాస్మాను దానం చేయండి! ఇది మీ శరీరం నుండి ఎక్కువ తీసుకోదు. ఆస్పత్రులు ప్లాస్మా ను తీసుకోవ‌డంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇది మీ వంతు అయినప్పుడు దయచేసి టీకాలు వేయించుకోండి! ఇది వైరస్ రాకుండా మిమ్మల్ని రక్షించకపోవచ్చు. కానీ ఇది ప్రభావం నుండి మిమ్మల్ని గణనీయంగా రక్షిస్తుంది`` అని తెలిపారు.

వేరొక‌ నోట్ లో ఒక వ్యక్తికి సోషల్ మీడియాలో తక్కువ మంది అనుచరులు ఉన్నా.. దీనిపై ప్ర‌చారం చేయొచ్చ‌ని అవిక అన్నారు. ఆమె సామాజిక అవగాహనపై సందేశంతో ఈ నోట్ ని రాశారు. “నేను బోధించడానికి ఇక్కడ లేను. మీరు బయటికి వెళ్లడానికి నిజంగా ముఖ్యమైన కారణం అవ‌స‌రం.. మీరు ఇంట్లోనే ఉండాలని అభ్యర్థించడానికి నేను ఇక్కడ ఉన్నాను. దీనితో మనం కలిసి పోరాడాలి. మేము దాన్ని దాదాపు ఒకసారి ఓడించాము. మనం మళ్ళీ పోరాడ‌గ‌లం. కానీ ఈసారి పనిని పూర్తి చేద్దాం. తద్వారా మనమందరం మళ్ళీ స్వేచ్ఛగా జీవించగలం. నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. మార్పు కోస‌మే ఈ త‌ప‌న‌. దయచేసి ముసుగు ధరించండి`` అని అవిక ప‌లు సూచ‌న‌లు చేశారు.
Tags:    

Similar News