ఈ సినిమా ఏదో చిత్రంగా ఉందే..

Update: 2015-11-04 22:30 GMT
హిందీ సీరియల్స్ లో మంచి పేరు సంపాదించి.. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ అవతారమెత్తింది అవికా గోర్. ఆ సినిమా మంచి విజయం సాధించి ఈ అమ్మాయికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. ఈ మధ్యే ‘సినిమా చూపిస్త మావ’ అంటూ తన తొలి సినిమా హీరో రాజ్ తరుణ్ తోనే ఇంకో సినిమా చేసింది అవికా. ఆ సినిమా కూడా హిట్టే. అయినా ఫలితం లేదు. అవికా చేతిలో ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. హీరోయిన్ ఫీచర్స్ లేవు, గ్లామర్ లేదు.. అన్న ముద్ర పడిపోవడమే దీనికి కారణం.

ఐతే తెలుగులో బండి జోరందుకోకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లి అక్కడో వెరైటీ సినిమా చేసింది అవికా. అదే.. ‘కిల్ దెమ్ యంగ్’. దీన్ని తెలుగులో ‘మాంజ’ పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు, హీరో ఒక్కరే. అతడి పేరు.. కిషన్. వయసు పాతికేళ్ల లోపే. ఈ కుర్రాడు కేవలం 11 ఏళ్ల వయసుకే డైరెక్టర్ అయ్యాడు. ఫుట్ పాత్ అనే సినిమా తీసి.. గిన్నిస్ రికార్డులకెక్కాడు. అవార్డులు కూడా అందుకున్నాడు. ఇప్పుడు తీసిన మాంజ కూడా చాలా విభిన్నమైన సినిమాగా చెబుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే కొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అంతే కాదు.. త్వరలోనే లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ కమిటీ ముందు ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారట. ఈ నెలాఖర్లో తెలుగు - కన్నడ - హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోందీ సినిమా.
Tags:    

Similar News