అమ్మడికి మీడియా సెగ తగిలేసింది

Update: 2015-08-12 17:10 GMT
మన మీడియా వాళ్ళున్నారే.. వాళ్ళకి నచ్చితే, నెత్తిన పెట్టుకొని పిచ్చగా పొగిడేస్తారు. అదే తేడా వస్తే, కనీసం ఒక్క వార్తయినా వేస్తే ఒట్టు. ప్రస్తుతం చిన్నారి పెళ్ళికూతురు అవికా గోర్‌ పరిస్థితి ఇలానే ఉంది. అమ్మడు అసలు ఏం చేయాలో తెలియని స్థితిలోకి జారుకుందని టాక్‌.

మ్యాటర్‌ ఏంటంటే.. గతంలో ఉయ్యాల జంపాల సినిమా హిట్టయిన సమయంలో, అసలు అవిక అతికి అర్ధంలేకుండా పోయింది. ఆ సమయంలో అమ్మడు నేనో టాప్‌ స్టార్‌ అన్నట్లు మీడియాతో బిహేవ్‌ చేయడంతో, మనోళ్ళు సరైన అవకాశం కోసం ఎదురుచూశారు. కట్‌ చేస్తే, లక్ష్మీ రావే మా ఇంటికి అనే సినిమా వచ్చింది. అది మొదటి ఆటకే ఢాం అనే సరికి అమ్మడికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. కాకపోతే ఫెయిల్యూర్‌ ను హీరో నాగశౌర్య మీదకు నెట్టేసింది. ఇప్పుడిక సినిమా చూపిస్తా మావా అంటూ మళ్ళొస్తోంది.

ఈసారి ఉయ్యాల జంపాల ఫేం రాజ్‌ తరుణ్‌ తోనే జతకట్టింది. కాని లాభం ఏముంది.. మీడియా ఈ అమ్మడి గురించి పెద్దగా రాయట్లేదు, చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. స్వింగులో ఉన్నప్పుడు కలరింగ్‌ ఇస్తే, ఎక్కడ నీ కెరియర్‌ కు రింగ్‌ వేసేయాలో మాకూ తెలుసు అన్నట్లుంది మనోళ్ళ పంతం. ఏదో ఒకటి మట్లాడి సెటిల్ మెంట్‌ చేసుకో అమ్మాయ్‌.. లేకపోతే అసలుకే మోసం వచ్చేత్తది!!!
Tags:    

Similar News