బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటైన అందగత్తె అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని వరుసగా సినిమా చూపిస్తా మామ- లక్ష్మీ రావే మా ఇంటికి- రాజుగారి గది 3- ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించింది. ఇప్పటివరకూ పలు బ్లాక్ బస్టర్లు దక్కినా కానీ తన ట్యాలెంట్ కి తగ్గ ఒక్క పాత్ర కూడా తనకు దక్కలేదనేది ఈ భామ ఆవేదన.
ఎట్టకేలకు అవికా కల నెరవేర్చే అరుదైన అవకాశం లభించింది. లైఫ్ లో ఎమోషన్స్ కి ఆస్కారం ఉండే పరిశోధనా జర్నలిస్టు పాత్రలో నటించనుంది. అది కూడా ఆది సాయికుమార్ సరసన నటిస్తున్న తాజా చిత్రంలో అలాంటి అరుదైన అవకాశం దక్కించుకుంది. పైగా ఈ సినిమా కథంతా తన చుట్టూనే తిరుగుతుంది. ఒక ఘటనపై పరిశోధించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా అవిక గొప్ప ఎలివేషన్ ఉన్న పాత్రతో మెస్మరైజ్ చేయాల్సి ఉంటుందట. ప్రస్తుతం తన పాత్ర కోసం కొందరు జర్నలిస్టుల ఆహార్యాన్ని పరిశీలిస్తోందిట. శిక్షణ కూడా తీసుకుంటోందని తెలిసింది.
సజ్జా వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న `అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్1`లో అవిక జర్నలిస్టుగా నటిస్తోంది. అవును బల్వీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జర్నలిస్టుగా అరుదైన అవకాశం దక్కింది. నిలబెట్టుకుంటుందా లేదా? అన్నది వేచి చూడాలి. అవికా గోర్ ఈ సినిమాతో పాటు థాంక్యూ లో కీలక పాత్ర ను పోషిస్తోంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాలోనూ కథానాయికగా నటిస్తోంది.