సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి`లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సక్సెస్ తో కీర్తికి జాతీయ స్థాయిలో పాపులారిలీ దక్కింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఒక్క సక్సెస్ కీర్తి కెరీర్ కే కొత్త ఐడెంటిటీని తీసుకొచ్చింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించడమా? అని విమర్శించిన వాళ్లు ముక్కున వేలేసుకునేలా చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ కి ఆ చిత్రం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో నటుడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ (101 జిల్లాల అందగాడు) కీర్తి సురేష్ ని చాలా తక్కువగా అంచనా వేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
`మహానటి` లో అవసరాల ఎల్ .వి ప్రసాద్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్ అశ్విన్ నటీనటుల ఎంపిక ప్రక్రియలో సావిత్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు? అని అడిగితే కీర్తి సురేష్ అని చెప్పారుట. దీంతో అవసరాల కమర్శియల్ సినిమాల్లో నటించింది. ఆమె మహానటి పాత్రకు ఎలా ఫిట్ అవుతుందని మనసులో అనుకున్నాడు. తక్కువగా అంచనా వేసాడుట. కానీ మహానటి పాత్రలో కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూసిన తర్వాత తన అంచనా తప్పైందని తాజాగా ఒప్పుకున్నాడు. సినిమా చూసిన తర్వాత ఆ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేగలదని నిరూపించిందని అవసరాల తెలిపాడు. అందుకే అన్నారు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. బహుశా ఈ ట్యాగ్ లైన్ అవసరాలకు ఆ తర్వాత అర్ధమై ఉంటుంది.
సావిత్రి సమకాలీకులు..ఆమె చిత్రాలన్ని ఇష్టపడే వారు కీర్తి సురేష్ ని చూసి సాక్షాత్తు మహానటి దిగొచ్చినట్లు ఉందని ప్రశంసించారంటే! కీర్తి ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందో అర్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు సైతం కీర్తి ఒక రేంజులో అందుకుంది. ఒంటి కన్నుతో కన్నీరు కార్చే సన్నివేశంలో కీర్తి నటించి మహానటినే గుర్తు చేసిందన్న ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అంతర్జాతీయ ఫిలిం ఫెస్ట్ వల్స్ లోనూ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. ఇటీవలే అవసరాల శ్రీనివాస్ నటించిన `101 జిల్లాల అందగాడు` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
బట్టతల అందగాడి జీవితకథలో
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కాన్సెప్టుల్ని ఎంచుకుని నటుడిగా దర్శకరచయితగా సత్తా చాటుతున్న అవసరాల శ్రీనివాస్.. ప్రతిసారీ సెన్సిబుల్ కామెడీ సున్నిత ఉద్వేగాలు ఉన్న కథల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించాడు. అందుకే ఇప్పుడు అతడు బట్ట తల కాన్సెప్ట్ తో మరో విభిన్నమైన ప్రయత్నం చేయగా తన నటనకు ప్రశంసలు దక్కాయి.
101 జిల్లాల అందగాడు అన్న టైటిల్ తో ఈ సినిమా రిలీజైంది. టైటిల్ కి అవసరాల బట్టతల బోయ్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాకి స్క్రిప్టు అందించడమే గాక.. అదిరిపోయే పంచ్ డైలాగుల్ని అవసరాల అందించారు. అవసరాల శ్రీనివాస్ తన వరకు బాగా నటించాడు. చాలా వరకు సరదాగా సాగే పాత్రలే చేసిన అవసరాల.. ఈ చిత్రంలో రెండు పార్శ్వాలున్న క్యారెక్టర్ని బాగానే పండించాడు. ద్వితీయార్ధంలో కొన్ని ఎమోషనల్ సీన్లలో అతడి నటన ఆకట్టుకుంటుంది. రుహాని శర్మ చి ల సౌ తర్వాత ఆకట్టుకున్న సినిమా ఇదే. అంజలి పాత్రకు ఆమె సరిపోయిందని రివ్యూలొచ్చాయి. కామెడీ ఆశించినంత పండకపోయినా యావరేజ్ అన్న టాక్ వినిపించింది.