న్యాచురల్ స్టార్ నాని హీరో బిజీగా ఉంటున్నా నిర్మాతగా కూడా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ను స్థాపించి మొదటి ప్రయత్నంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'అ!' అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు నాని. తాజా సమాచారం ప్రకారం నాని మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట.
రీసెంట్ గా 'పిట్టగోడ' ఫేమ్ అనుదీప్ న్యాచురల్ స్టార్ కు ఒక మంచికథ వినిపించాడట. కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ స్క్రిప్ట్ ను అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ కూడా విన్నారని.. స్వప్న కు కూడా ఈ కథ నచ్చడంతో నాని తో కలిసి ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ.. ప్రియదర్శి.. షాలిని పాండే.. నవీని పోలిశెట్టి లీడ్ యాక్టర్స్ గా నటిస్తారు.
స్వప్న సినిమా బ్యానర్లో గతంలో నాని 'ఎవడే సుబ్రమణ్యం'సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 'మహానటి' లాంటి అద్భుతమైన సినిమాను కూడా నిర్మించి తమకు ఉత్తమ అభిరుచి ఉందని ప్రూవ్ చేశారు. ఇప్పుడు నానితో కలిసి ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారంటే మంచి సబ్జెక్ట్ అయి ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందట. రెగ్యులర్ షూట్ మాత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందని సమాచారం.