సూపర్ సెక్సీ హీరోయిన్ మళ్ళొస్తోందిగా..

Update: 2017-02-22 05:15 GMT
అప్పట్లో సూపర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తన అందచందాలను ఆరేసిన అయేషా టకియా గుర్తుందా? ఆ సినిమాలో గుచ్చి గుచ్చి చంపమాకు హొయలా అంటూ పాప పైట తీసి పక్కనేస్తే.. కుర్రాళ్ళకు గుండె జారి పల్స్ డౌన్ అయిపోయింది. అమ్మడు తన అందాలను ఆరేస్తుంటే.. వామ్మో అందరికీ పిచ్చి పీక్స్ కు వెళ్ళిపోయి గాట్టిగా మత్తెక్కేసింది. ఈ సుందరి 2009లో సమాజ్ వాధీ పార్టీ కాంట్రోవర్సీ కింగ్ అబు ఆజ్మీ కుమారుడు ఫరాన్ ఆజ్మీని పెళ్ళిచేసుకుని.. సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మాత్రం అమ్మడు తిరిగి సినిమాల్లోకి వస్తానంటూ ఉవ్విళ్ళూరుతోంది.

నిజానికి 2013లో కొడుకు పుట్టేంత వరకు అమ్మడు అడపాదడపా అక్కడక్కడా మెరిసింది కాని.. ఆ తరువాత మాత్రం ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆవిడ మామగారు రేప్స్ పై కొన్ని చెత్త కామెంట్ల చేసినప్పుడు మాత్రమే.. ఆయన తప్పుగా మట్లాడుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చింది. కట్ చేస్తే గత డిసెంబర్ లో ఒక మ్యూజిక్ వీడియో షూట్లో పాల్గొంది. ఆ వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదు కాని.. ఇప్పుడు అమ్మడు ఒక రెండు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేయడానికి ఒప్పుకుందట. అప్పట్లో సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమాలో మెరిసింది కాబట్టి.. బహుశా ఖాన్ భాయ్ క్యాంపులో మళ్లీ ఏదన్నా చేద్దామని ప్రయత్నిస్తుందేమో చూడాలి.

ఇలాంటి రీ-రిటర్న్ అవుతున్న మాజీలంటే మన తెలుగు దర్శకనిర్మాతలకు కూడా తెగ లవ్వు కదా. ఆల్రెడీ అందరూ మర్చిపోయిన నదియా అండ్ మధుబాలను అలాగే దించేశారు మనోళ్ళు. మరి అయేషా పాపను కూడా తెస్తారేమో చూద్దాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News