ఏ పరిశ్రమలో అయినా ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరోగా ఎదిగి పాపులర్ అవ్వడం ఎంతో కష్టంతో కూడిన వ్యవహారమే. కేవలం టాలెంట్ ని నమ్ముకొని కొత్త కథలు ఎంచుకున్నప్పుడే ఎవరైనా హీరోగా నిలదొక్కుకోగలరు. అయితే అదే కోవలో వెళ్తూ ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు ఆయుష్మాన్ ఖురాన్. ఇతగాడి సినిమాలు ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడే పరిస్థితి.
ఈ బాలీవుడ్ హీరో చేసిన మొదటి సినిమా 'విక్కీ డోనర్' మొన్నీ మధ్య 'నరుడా దోనరుడా' గా తెలుగులో రీమేక్ అయింది. అయుష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'అంధధున్' తెలుగు రైట్స్ ఇప్పటికే నితిన్ తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ రీమేక్ పట్టాలెక్కబోతుంది.
అయితే తాజాగా ఈ హీరో నుండి వచ్చిన మరో సినిమా 'బాలా' కూడా పెద్ద హిట్టైంది. ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. అందుకే ఈ సినిమా telugu రీమేక్ రైట్స్ కోసం కొందరు నిర్మాతలు ఈ సినిమా నిర్మాత ఆఫీస్ కి క్యూ కట్టారని తెలుస్తుంది. నిజానికి బాలా అదిరిపోయే కాన్సెప్ట్ సినిమా. చిన్న వయసులోనే బట్టతల వచ్చి భాద పడే కుర్రాడి కథ. ఇప్పటి జెనరేషన్ ఎదురుకుంటున్న సమస్య కావడంతో తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే చాన్స్ ఉంది. మరి ఫైనల్ గా ఈ రీమేక్ రైట్స్ ఏ నిర్మాత సొంతం చేసుకుంటాడో.. ఏ హీరో చేతిలో పెడతారో..?