రీల్ జీవుల జీవితాలు సానా సిత్రంగా ఉంటాయి. రియల్ లైఫ్ కు సంబంధం లేని రీతిలో రీల్ లో జీవించాలి. అప్పుడు మాత్రమే ప్రేక్షకుల మదిని దోచుకునే వీలుంటుంది. రీల్ లో చెలరేగిపోయి నటించే కొన్ని సీన్లు.. ఇంట్లో అందరి ముందు కూర్చొని చూడలేని పరిస్థితి. అలాంటిది సదరు హీరోల్ని కట్టుకునే భార్యల పరిస్థితి ఏమిటి? తమ పనిలో తాము ఉండే వారు.. తెర మీద చెలరేగిపోయి చేసే రొమాంటిక్ సీన్లను చూసే హీరోల భార్యల పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహం రాక మానదు.
తాజాగా తనకు కలిగిన ఫీలింగ్స్ మీద ఓపెన్ అయ్యారు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్. తన భర్త సినిమాల్లో చేసే శృంగార సన్నివేశాలు తనను తెగ ఇబ్బంది పెట్టేవని చెప్పారు. ఆయుష్మాన్ ను అలా చూడటం తనకు ఇబ్బందే కాదు.. అభద్రతాభావానికి గురి చేసేవన్నారు.
అయితే.. రాన్రాను ఆ ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. గతంలో తనను వేధించిన అభద్రతా భావం ఇప్పుడు తగ్గినట్లు చెప్పారు. గతంలో తన భర్త చేసే శృంగార సన్నివేశాలకు ఇబ్బందికి గురయ్యే దానినని.. కానీ ఎప్పుడైతే ఆయన చేసే సినిమాల్లో పని చేయటం షురూ చేశానో అది కాస్తా తగ్గిపోయిందన్నారు.
తన భర్త నటించిన అంధాదున్ సినిమా ఎడిటింగ్ చూస్తున్నప్పుడు.. హీరో - హీరోయిన్ల మధ్య ఏదో మిస్ అయ్యిందని తానే సలహాలు ఇవ్వటం స్టార్ట్ చేశానని.. తనలో వచ్చిన మార్పును అలా గుర్తించినట్లు చెప్పింది. తెర మీద చూసే కన్నా.. రీల్ లైఫ్ ను నేరుగా చూసినప్పుడు అసలు విషయాలు అర్థం కావటం ఖాయం. మొత్తానికి హీరోగారి భార్య.. హీరో చేసే సినిమాల విషయాన్ని నేరుగా పర్యవేక్షిస్తుందన్న విషయాన్ని భలేగా చెప్పిందే.