మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్ హీరోగా.. తెలుగులో ఓ మూవీ ప్రారంభమైంది. అఫ్ కోర్స్.. ఇతనికి అబ్బాస్ అని పిలిపించుకోవడం బాగా ఇష్టం కాబట్టి.. మనం కూడా అలాగే అనుకుందాం. 'ఇద్దరికీ కొత్తేగా' అనే టైటిల్ తో రూపొందనన్న మూవీతో అబ్బాస్ హీరోగా పరిచయం కానున్నాడు.
'చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నటుడిని కావాలనే ఆలోచన చిన్న వయసు నుంచే ఉంది. మా ఆంటీ సంగీతా బిజిలానీ సినిమాలను టీవీలో చూస్తూ.. యాక్టర్ ని అవ్వాలనే స్ఫూర్తి పొందాను' అంటున్నాడు అబ్బాస్. అయితే.. ఇప్పుడీ సినిమాని స్టార్ట్ చేసినా.. ఇతని ఫస్ట్ కెరీర్ మాత్రం ఇది కాదు. దర్శకుడు సురేష్ బాబు కొన్నేళ్ల క్రితమే ఓ స్టోరీ చెప్పాడట. తండ్రి అజారుద్దీన్ కూడా.. ఈ మూవీని స్టార్ట్ చేసేయమని చెప్పాడట.
అయితే దిగ్గజ క్రికెటర్ వారసుడిగా, ఆ రంగంలోనూ సత్తా చాటేందుకు క్రికెట్ లో అడుగు పెట్టాడు. కొన్ని అడుగులు ముందుకు పడ్డాక మోచేతి గాయం కారణంగా.. క్రికెట్ కి లాంగ్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సమయాన్ని వృథా చేసుకోకుండా.. సినీ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు అబ్బాస్.