బాహుబలి బిజినెస్ లెక్కలు కళ్లు చెదిరిపోయేలా చేస్తున్నాయి. వసూళ్లకు కూడా ఢోకా ఉండదనే అనుకుంటున్నారంతా. కానీ బయ్యర్లు ఏ మేరకు లాభాల బాట పడతారన్నదే ఇక్కడ సందేహం. లాభాల సంగతలా ఉంచుదాం.. బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాను మామూలు రేట్లకు అమ్మలేదు. ప్రతి ఏరియాలోనూ కనీ వినీ ఎరుగని రేటుకు సినిమాను అమ్మారు. సినిమా మీద ఉన్న అంచనాల్ని.. హైప్ ను చూపించి.. తొలి భాగానికి వచ్చిన వసూళ్ల కంటే కూడా చాలా ఎక్కువ మొత్తానికి.. మరీ రిస్కీగా అనిపించే రేట్లకు సినిమాను అమ్మారు. తొలి భాగం సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘బాహుబలి’ అంటే ఒక బంగారు గని అనే భావనతో బయ్యర్లు కన్నూ మిన్నూ తెలియకుండా ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టారు.
ఉదాహరణకు అమెరికా సంగతే తీసుకుంటే ‘బాహుబలి: ది బిగినింగ్’ అక్కడ 8 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. దీంతో బాహుబలి-2ను దాదాపుగా అంతే రేటుకు అమ్మారు. కానీ ఇక్కడ ఈసారి 8 మిలియన్ డాలర్లో.. 10 మిలియన్ డాలర్లో వసూలు చేస్తే సరిపోదు. అమెరికాలో వచ్చే గ్రాస్ వసూళ్లలో షేర్ గా మిగిలేది సగమే. మిగతాదంతా ట్యాక్సులు.. థియేటర్ రెంట్లు.. ఇతర ఖర్చుల్లో వెళ్లిపోతుంది. అంటే ‘బాహుబలి: ది కంక్లూజన్’ అక్కడ 15 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేస్తే తప్ప బయ్యర్ బయటపడడు. అంటే రూపాయల్లో చెప్పాలంటే అక్కడ ‘బాహుబలి-2’ వంద కోట్ల దాకా వసూలు చేయాలి. అది అనుకున్నంత సులభం కాదు. ఎంత హైప్ ఉన్నప్పటికీ అమెరికాలో వంద కోట్ల వసూళ్లంటే మాటలా? అందుకే సాధ్యమైనంత త్వరగా జేబులు నింపుకోవడానికి టికెట్ రేటును 30-40 డాలర్ల మధ్య పెట్టేస్తున్నారు. దీనిపై అమెరికన్ తెలుగు ఆడియన్స్ లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇదేం దోపిడీ అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ బయ్యర్ మాత్రం అలా కాకుంటే తాము సేఫ్ జోన్లోకి రావడం కష్టమంటున్నాడు. ‘బాహుబలి-1’ తరహాలో రెండో భాగానికి పెద్దగా లాభాలు ఆశించట్లేదని బయ్యరే స్వయంగా చెబుతున్నాడంటే ‘బాహుబలి-2’ పరిస్థితేంటో అంచనా వేయొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/