‘బాహుబలి: ది కంక్లూజన్’ రికార్డుల మోతకు ఇంకా తెరపడలేదు. కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డుల్ని దాటిన ఈ సినిమా.. మరో మైలురాయిని అందుకుంది. ఈ సినిమాకు ఇప్పటిదాకా ఇండియాలో పది కోట్ల టికెట్లు అమ్ముడుబోవడం విశేషం. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే 10 కోట్లకు పైగా టికెట్లు తెగిన రెండో సినిమా ఇదే అని తెలుస్తోంది. ఇంతకుముందు ‘షోలే’ మాత్రమే ఈ ఘనత సాధించింది.
‘షోలే’ సినిమాకు 15 కోట్లు టికెట్లు అమ్మడయ్యాయని.. కాదు 25 కోట్లు అని.. రకరకాల లెక్కలు చెబుతారు. ఐతే అది పది కోట్ల మైలురాయిని దాటడం మాత్రం వాస్తవం. ఇక సల్మాన్ ఖాన్ సినిమా ‘హమ్ ఆప్ కే హై కౌన్’కు 7.5 కోట్ల దాకా టికెట్లు తెగినట్లు సమాచారం. దాన్ని ‘బాహుబలి-2’ అధిగమించి రెండో స్థానానికి చేరుకుంది. ఐతే షోలో, హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాలు ఇండియా వరకే రిలీజయ్యాయి. ‘బాహుబలి-2’ ఇండియా అవతల కూడా భారీ స్థాయిలో రిలీజైంది. అక్కడ అమ్ముడైన టికెట్ల లెక్కలు తేలడం కష్టం.
మొత్తానికి ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక మంది థియేటర్లలో చూసిన సినిమాల్లో ఒకటిగా ‘బాహుబలి-2’ చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రం నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం చైనాతో పాటు మరిన్ని దేశాల్లో విడుదల కావాల్సి ఉంది. రెండు భాగాల్ని కలిపి ఒకటిగా ఎడిట్ చేసి ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ వెర్షన్ కూడా ఒకటి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/