వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిన బాహుబలికి కష్టకాలమేంటి అంటారా..? ఇది ఇండియా సంగతి కాదు.. అమెరికా సంగతీ కాదు. చైనాకు సంబంధించిన విషయం. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చైనాలో మాత్రం చతికిలబడ్డ సంగతి తెలిసిందే. అక్కడ ఆ సినిమా సాధించిన ఏడు కోట్ల వసూళ్లు రిలీజ్ ఖర్చులకే సరిపోయాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కూడా అక్కడ అద్భుతాలు చేసేస్తుందన్న అంచనాలేమీ లేవు. ‘బాహుబలి-1’ను పట్టించుకోని చైనీయులు.. రెండో భాగం కోసం మాత్రం ఎగబడతారని ఎలా అనుకుంటాం. కాకపోతే ఈసారి రిలీజ్ విషయంలో ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామని.. మంచి వసూళ్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాతలు.
ఐతే ఇండియాలో విడుదలైన కొన్ని నెలలకే చైనాలోనూ రిలీజ్ చేస్తున్నా.. ఈసారి ఎక్కువ థియేటర్లు తీసుకుంటున్నా.. మంచి స్క్రీన్లు ఎంచుకుంటున్నా.. మొత్తం పరిస్థితి అయితే ఆశాజనకంగా లేదు. అక్కడి ప్రేక్షకుల్లో ‘బాహుబలి-2’పై అంత ఆసక్తి మాత్రం లేదంటున్నారు. బాహుబలి తరహా సినిమాలు చైనాలో చాలానే రావడం ఇందుకు ఓ కారణం. మరోవైపు గత కొన్ని నెలలుగా భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనీయులు బాహుబలి-2ను ఏమాత్రం పట్టించుకుంటారో.. భారత్ పట్ల ఇప్పుడు చైనీయుల్లో ఉన్న వ్యతిరేకత కూడా బాహుబలి-2కు చేటు చేస్తుందేమో అన్న సందేహాలు నెలకొంటున్నాయి. చైనా మనకు చెడు చేస్తోందని.. చైనా వస్తువుల్ని నిషేధించాలని మన దగ్గర ఉద్యమాలు నడుస్తున్నపుడు.. వాళ్లు మాత్రం మనకు వ్యతిరేకంగా పని చేయరని గ్యారెంటీ ఏంటి? ఈ నేపథ్యంలో సెప్టెంబరు విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి-2కు కష్టకాలం తప్పదనే భావిస్తున్నారు.