ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన సినిమా బాహుబలి. ఈ సినిమా రెండో భాగమైన బాహుబలి: ది కంక్లూజన్ సినిమాకు దేశం మొత్తంమీద ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో భారత్ లో రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా బాహుబలి కీర్తి గడించింది. ఇతర దేశాల్లో వచ్చిన కలెక్షన్లు కలుపుకొంటే రూ. 1500 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఓరకంగా రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది.
ఏప్రిల్ 28న బాహుబలి థియేటర్లకు వచ్చాడు. తెలుగు తమిళం హిందీ మళయాళం భాషల్లో ఒకేసారి రిలీజైంది. అప్పటి నుంచి బాహుబలి జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఈ సినిమా థియేటర్లకు వచ్చి 75 రోజులు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టి ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. కలెక్షన్ల సంగతి అటుంచితే వారం రెండు వారాలకే థియేటర్ల నుంచి సినిమా మాయమైపోతున్న ఈ రోజుల్లో ఇన్నాళ్లపాటు సినిమా ఆడుతూ ఉండటమే ఓ విశేషమని చెప్పాలి. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ ఈ సినిమా ఇంకా రన్ అవుతోంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ రానాలకు దేశవ్యాప్తంగా ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
అమీర్ ఖాన్ సినిమా దంగల్ చైనాలో విడుదలయ్యాక ఆ సినిమా బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్లను దాటేసింది. కానీ బాహుబలి-2 ఇంకా చైనాలో రిలీజ్ కాలేదు. త్వరలో ఆ దేశంలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడా బాహుబలి జైత్ర యాత్ర కొనసాగిస్తే మరోసారి రికార్డుల మోత మోగిపోవడం ఖాయం.