జపాన్‌లో బాహుబలి ప్రకంపనలు

Update: 2018-03-04 09:12 GMT
‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై పది నెలలు దాటుతోంది. ఇంకా ఆ సినిమా ప్రకంపనలు ఆగిపోలేదు. ఈ పది నెలలుగా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో విడుదలవుతూ చక్కటి వసూళ్లు సాధిస్తూ సాగిపోతోంది ఈ చిత్రం. నెల కిందటే ‘బాహుబలి-2’ జపాన్‌ లో విడుదలైంది. అక్కడ సంచలన వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పటిదాకా ఈ చిత్రం జపాన్‌ లో మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమా అక్కడ బాగానే ఆడుతోంది. బాహుబలి-2కు అక్కడ క్రేజ్ ఎలా ఉందో చూపిస్తూ ఎప్పటికప్పుడు చిత్ర నిర్మాతలు ట్విట్టర్లో స్పందిస్తూనే ఉంటారు.

దీని కంటే ముందు రష్యా.. జర్మనీ దేశాల్లోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలైంది. దాని కంటే ముందు పలు దేశాల్లోనూ ఈ చిత్రం సందడి చేసింది. గత ఏడాది ఏప్రిల్ 28న ఇండియాతో పాటు అమెరికా ఇతర దేశాల్లో భారీ ఎత్తున విడుదలైందీ చిత్రం. ఉత్తర అమెరికాలో ఏకంగా 21 మిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రకంపనలు రాబట్టింది. ఇప్పటిదాకా బాహుబలి-2 వసూళ్లు 1800 కోట్ల దాకా ఉండటం విశేషం. ఇండియాలో వెయ్యి కోట్ల వసూళ్లు మార్కును దాటిన తొలి సినిమా ఇదే. ‘దంగల్’ సినిమా అనూహ్యంగ చైనాలో ఇరగాడేయబట్టి ‘బాహుబలి-2’ రికార్డు బద్దలైంది కానీ.. లేదంటే దీని రికార్డులు చాలా కాలం నిలిచిపోయేవే.
Tags:    

Similar News