‘బాహుబలి: ది కంక్లూజన్’కు ఇండియాలో యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో పిల్లలు.. పెద్దలు అందరూ కలిసి సినిమా చూస్తున్నారు. ఐతే సింగపూర్లో మాత్రం ఈ చిత్రానికి అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. అక్కడ 16 ఏళ్లలోపు వయసు వారు ఈ సినిమాను చూడకుండా సెన్సార్ బోర్డు ‘ఎన్ సి 16’ సర్టిఫికెట్ ను ‘బాహుబలి-2’కు కేటాయించింది.
సినిమాలో హింస పెద్ద స్థాయిలో ఉందని.. రక్తపాతం ఎక్కువగా ఉండటం.. యుద్ధ సన్నివేశాల్ని వయొలెంట్ గా ఉండటాన్ని కారణంగా చూపించి దీనికా సర్టిఫికెట్ ఇచ్చారు. ఇండియాతో పోలిస్తే సింగపూర్లో సెన్సార్ షిప్ కఠినంగా ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగానే జనాల్ని సినిమాలకు అనుమతిస్తారు. 16 ఏళ్ల లోపు వారిని అనుమతించకపోవడంతో పిల్లల తల్లిందండ్రులు కూడా ఈ సినిమాకు దూరమవుతున్నారు. ఇది ‘బాహుబలి-2’ వసూళ్లకు కొంత నష్టం చేకూర్చేదే.
ఐతే ‘బాహుబలి-2’కు సింగపూర్లో అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ ఇవ్వడంపై మన మీడియా వాళ్లు మరీ ఆశ్చర్యపోతున్నారు. నేషనల్ వెబ్ మీడియాలోనూ దీనిపై డిస్కషన్ నడుస్తోంది. ఐతే మన దగ్గర రాష్ట్రానికో రకంగా వ్యవహరిస్తారు సెన్సార్ అధికారులు. రీజనల్ సెన్సార్ బోర్డులో ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తే.. పై స్థాయికి వెళ్లి ‘యు/ఎ’ తెచ్చుకుంటూ ఉంటారు. ఒక రాష్ట్రంలో ‘యు’ తెచ్చుకున్న ఓ సినిమా.. మరో రాష్ట్రంలో ‘ఎ’ అందుకుంటుంది. మన దగ్గర అంత వైరుధ్యం ఉన్నపుడు.. సింగపూర్ సెన్సార్ బోర్డు గురించి అంత ఇదైపోవడం దేనికి? ఎవరి రూల్స్ వాళ్లకుంటాయి. కాబట్టి దీని గురించి మరీ అంత చర్చేమీ అవసరం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/