బాహుబలి2 ర్యాంక్.. హిందీ 1.. తెలుగు 6

Update: 2017-05-16 10:50 GMT
బాహుబలి2 సెన్సేషన్స్ సంగతేమో కానీ.. వసూళ్ల వర్షం మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను పక్కనపెట్టి.. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్ల వరకే తీసుకున్నా.. బాహుబలి2 ప్రభంజనం అర్ధమవుతుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా బాహుబలి2 హిందీ వెర్షన్ కొత్త రికార్డ్ సృష్టించింది.

దేశంలో 400 కోట్ల క్లబ్ ను ప్రారంభించిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన ఈ మూవీ.. రిలీజ్ అయిన దగ్గర నుంచి 17 రోజుల్లోనే 433 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించగలిగింది. ఈ లిస్ట్ లో బాహుబలి తర్వాతి స్థానాల్లో.. దంగల్.. పీకే.. భజరంగీ భాయ్ జాన్.. సుల్తాన్ ఉండగా.. 6వ స్థానంలో కూడా బాహుబలి2 మూవీ నిలవడం విశేషం. 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో బాహుబలి2 తెలుగు వెర్షన్.. ఆల్ టైం టాప్ ఇండియన్ వసూళ్లను సాధించిన జాబితాలో ఆరవ స్థానంలో ఉంది.

ఇదే లిస్ట్ లో బాహుబలి ది బిగినింగ్ తెలుగు వెర్షన్ 225 కోట్ల నెట్ వసూళ్లతో 8వ స్థానంలో నిలిచింది. టోటల్ ఇండియా కలెక్షన్స్ టాప్ 10 జాబితాలో కేవలం తెలుగు వెర్షన్ వరకే రెండు సార్లు నిలిచిందంటే.. బాహుబలి ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోందో అర్ధమవుతుంది. అయితే.. ఈ రేంజ్ ఫుల్ రన్ లో మరింతగా పెరగనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News