సినిమాల పరంగా చూసుకుంటే 2017 సంవత్సరాన్ని బాహుబలి నామ సంవత్సరంగా నిస్సందేహంగా చెప్పేయొచ్చు. దర్శక ధీరుడు రాజమౌళి తీర్చిదిద్దిన బాహుబలి సెకండ్ పార్ట్ ఇంతవరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. రిలీజయిన ప్రతి భాషలోనూ కలెక్షన్ల కనకవర్షం కురిసింది. ఇందులో నటించిన వారంతా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. తెలుగు సినిమాల కీర్తిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది బాహుబలి సినిమా.
ఇప్పటికే బాహుబలి ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులున్నాయి. తాజాగా మరో ఘనత బాహుబలి ఖాతాలో చేరింది. హాలీవుడ్ లో రొటెన్ టమాటాస్ అనే పాపులర్ వెబ్ సైట్ ఉంది. హాలీవుడ్ సినిమాలకు ఈ సైట్ ఇచ్చే రివ్యూలకు.. రేటింగ్ కు చాలా వాల్యూ ఉంటుంది. ఈ వెబ్ సైట్ 2017 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వేలాది సినిమాల్లో టాప్ 10 లిస్ట్ ఎంపిక చేసింది. ఇందులో బాహుబలికి రెండోస్థానం దక్కింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ మొత్తం చందమామ కథలా ఉన్నా రెండో పార్ట్ ను డైరెక్టర్ రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబిచ్చేశారు. ఈ సినిమా ఓ ఎపిక్ గా నిలిచిపోతుందని అందులో ప్రశంసించేశారు.
ఇండియాతోపాటు దక్షిణ ఆసియా అంతా బాహుబలి మాసివ్ హిట్ అయింది. సినిమాల్లో కథావస్తువు పాతదే అయినా దానిని సరికొత్తగా చెబితే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ఈ మూవీ ప్రూవ్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే మనం సినిమాలంటే ఎందుకు ఇష్టపడతాం అంటే కొన్ని సినిమాల పేర్లు అలా నోటికొచ్చేస్తాయి. బాహుబలి కూడా అదేవిధంగా సినిమాలపై మనకున్న ఇష్టాన్ని పెంచే అద్భుతమైన చిత్రమని ఆ హాలీవుడ్ సైట్ బాహుబలిని ఆకాశానికెత్తేసింది.