10 రోజుల్లో 1052 నాట్ ఔట్

Update: 2017-05-09 04:40 GMT
బాహుబలి 2. ఇప్పటికీ దిగ్విజియంగా రన్ అవుతోంది. సినిమాలో కంటెంట్ ప్రేక్షకులకు తెగ నచ్చేయడంతో.. రెండో సోమవారం కూడా సినిమాకు మామూలుగా కమర్షియల్ హిట్స్ కు ఉండేంత రేంజులో డ్రాప్ అయితే లేదు. అందుకే ఇప్పుడు ఈ ప్రభంజనం నాన్ స్టాప్ గా 1000 స్కోర్ ను దాటేసి దూసుకుపోతోంది. ఒక్కసారి అసలు 10 రోజుల్లో మనోడు ఎక్కడ ఎంత కొట్టాడో చూద్దాం పదండి.

పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఏకంగా 139+ కోట్లు షేర్ వసూలు చేసింది బాహుబలి రెండో భాగం. అంటే షుమారుగా 200 కోట్ల గ్రాస్‌ అనుకోండి. ఇక కర్ణాటక నుండి 75 కోట్ల గ్రాస్ (35 కోట్ల షేర్).. తమిళనాడు 82+ గ్రాస్ (42 షేర్).. కేరళ 41+ గ్రాస్ (10+ షేర్).. తక్కిన నార్త్ ఇండియా 180 కోట్ల షేర్ (458+ కోట్ల గ్రాస్) ఈ సినిమా వసూలు చేసింది. అంటే భారతదేశంలో మొత్తంగా 416+ కోట్ల షేర్.. 859+ కోట్ల గ్రాస్‌ వచ్చిందనమాట.

ఇకపోతే అమెరికా నుండి 106 కోట్ల గ్రాస్‌ (68 షేర్) అలాగే ఇతర దేశాల నుండి 87 కోట్ల గ్రాస్ (49 షేర్) వచ్చింది. అంటే మొత్తంగా బాహుబలి 10 రోజుల్లో 1052 కోట్ల గ్రాస్‌ అలాగే 534 కోట్ల షేర్ వసూలు చేసింది. 1052 నాట్ ఔట్ అండ్ కౌంటింగ్!!
Tags:    

Similar News