బాహుబలి 2.. చైనాలో టైమొచ్చింది

Update: 2017-06-03 04:37 GMT
బాహుబలి 2 సినిమా విడుదలై మన దేశం బాక్స్ ఆఫీసు వద్ద చేసిన కలెక్షన్ల సునామీ సినీ జగత్తు ఎప్పటికీ మరవలేదు. 1500 కోట్ల మార్క్ దాటి 2000 కోట్ల మార్కుకు చేరువలో ఉన్న ఈ సినిమా ఇప్పుడు చైనీస్ లో కూడా విడుదలకాబోతుంది. ఇప్పటికే డబ్బింగ్ పనులు అన్నీ పూర్తి చేసుకొని ఒక తేదిని నిర్ధారించుకునే పనిలో ఉన్నారు బాహుబలి టీమ్.

బాహుబలి సినిమా నిర్మాత శోబు యార్లగడ్డ మాటలాడుతూ “సినిమా డబ్బింగ్  పనులు అన్నీ సవ్యంగా సాగుతున్నాయిని తొందరలో డిస్ట్రిబూటర్ తో మాటలాడి ఒక తేది వెల్లడిస్తాము అని చెప్పారు. చైనాలో దంగల్, పి‌కే సినిమాను  డిస్ట్రిబూట్ చేసినవారే బాహుబలి 2 నుకూడా విడుదల చేస్తున్నారు” అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. అందిన సమాచారం బట్టి వచ్చే నెలలో విడుదల చేయవచ్చు అని తెలుస్తుంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనా లో విడుదలై 1000 కోట్లు కలెక్షన్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు బాహుబలి 2 వంతు వచ్చింది. ఈ  సినిమా కూడా అక్కడ విడుదల కాబోతుండంతో అందరీ దృష్టి రాజమౌళి డైరెక్ట్ తీసిన బాహుబలి2 పై పడింది.

చైనా వాళ్ళు ఇలాంటి జానపద చిత్రాలు అంటే అమిత ఇష్టంగా చూస్తారు కాబట్టి కచ్చితంగా బాహుబలి విజయ పతాకం ఎగరవేస్తుందిని ఇండియా సినీ వర్గాలు నమ్మకంగా ఉన్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి , అనుష్క శెట్టి, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రం ఇండియాలో ఒక అజరామరం.​ కాని బాహుబలి 1 మాత్రం చైనాలో ఫ్లాపైంది. అదే అతి పెద్ద ట్విస్ట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News