మన దగ్గర చిన్న సినిమాల్ని కూడా 300-400 థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. మీడియం రేంజి సినిమాలకు కూడా ఏడెనిమిది వందల థియేటర్లు ఇస్తుంటారు. ఇక పెద్ద సినిమాలైతే మినిమం వెయ్యి థియేటర్లు పడతాయి. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి హీరోల సినిమాల్ని 1500కు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. కానీ మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు.. కేరళల్లో ఈ పరిస్థితి లేదు. తమిళనాడు మొత్తం వెయ్యి థియేటర్లు కూడా లేవు. అక్కడ పెద్ద సినిమాల్ని 500-600 థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. కేరళలో అయితే 300 థియేటర్లలో విడుదల చేస్తే చేస్తే అది బిగ్ రిలీజ్ అన్నట్లు.
చిన్న రాష్ట్రమైన కేరళలో పోయినేడాది ‘సరైనోడు’ మలయాళ వెర్షన్ ‘యోధవు’ను 80 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఒక డబ్బింగ్ సినిమాకు ఇన్ని థియేటర్లా అని అప్పుడు ఆశ్చర్యపోయారు కేరళ జనాలు. ఐతే ఈ నెలాఖర్లో రాబోతున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ను ఏకంగా 300 థియేటర్లలో రిలీజ్ చేయబోతుండటం విశేషం. అంటే బన్నీ సినిమాకు నాలుగింతల స్థాయిలో బాహుబలి రిలీజ్ కాబోతోందన్నమాట. మరోవైపు తమిళనాడులో కూడా ‘బాహుబలి-2’ భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. గత ఏడాది రజినీ సినిమా ‘కబాలి’ని రిలీజ్ చేసిన స్థాయిలోనే దీన్ని కూడా విడుదల చేస్తున్నారు. అక్కడ దాదాపు 800 థియేటర్లలో ‘బాహుబలి-2’ విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఈ నెల 28న వేరే సినిమాలేమీ విడుదల కావట్లేదు. ‘బాహుబలి-2’ను తమ సినిమాలాగే భావిస్తున్నారు అక్కడి జనాలు. అంచనాలు మామూలుగా లేవక్కడ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/