ఒకే లొకేషన్లో ఒక సినిమా మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకోవడం ఎక్కడైనా చూస్తామా.. బాహుబలి విషయంలో మాత్రమే అది సాధ్యమైంది. మూడేళ్ల కిందట్నుంచి ఈ సినిమా షూటింగుకి రామోజీ ఫిలిం సిటీ వేదికగా నిలుస్తోంది. 2013లో ఈ సినిమా షూటింగ్ కర్నూలులో మొదలై.. రామోజీ ఫిలిం సిటీకి షిఫ్టయింది. ఇక అప్పట్నుంచి ఎన్ని రోజులు ఇక్కడ షూటింగ్ జరిగిందో లెక్కబెట్టడం కష్టం. కొన్ని రోజులు కేరళలో, కొన్ని రోజులు బల్గేరియాలో షూటింగ్ చేశారు తప్పితే.. మిగతా అంతా ఫిలిం సిటీలోనే కానిచ్చేశాడు జక్కన్న. విశాలమైన ప్రదేశం.. సకల సౌకర్యాలు.. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ.. ఎంత పెద్ద సెట్టింగ్ కావాలనుకుంటే అంత పెద్దది వేసుకునే సౌకర్యం.. ఏ డిస్టబెన్స్ ఉండదు.. జక్కన్న లాంటి వాడికి ఇంతకంటే ఏం కావాలి? అందుకే ఆయనకు రామోజీ ఫిలిం సిటీ రెండో ఇల్లుగా మారిపోయింది.
మూడు నెలల కిందట బాహుబలి-2 షూటింగ్ కూడా ఇక్కడే మొదలుపెట్టాడు రాజమౌళి. తర్వాత కేరళకు వెళ్లి కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకుని వచ్చాడు. గత కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఓ షెడ్యూల్ అయింది. అది పూర్తి చేసుకుని తిరిగి ఫిలిం సిటీలో అడుగుపెట్టింది బాహుబలి-2 యూనిట్. ఇప్పటిదాకా తీసినవి అంత కీలక సన్నివేశాలమీ కావని.. బాహుబలి-2కు ప్రాణం అనదగ్గ సన్నివేశాలు ఇకపైనే మొదలవుతాయని చెబుతున్నారు. ఇక నిర్విరామంగా ఫిలిం సిటీలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ - రానా - అనుష్క సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటుందట. యుద్ధం ఎపిసోడ్ తో పాటు సినిమాకు కీలకం అనదగ్గ సన్నివేశాలన్నీ ఇకపైనే చిత్రీకరించబోతున్నారట.