‘బాహుబలి: ది కంక్లూజన్’ ఓవైపు థియేటర్లలో ఇరగాడేస్తుండగానే.. మరోవైపు పైరసీ ప్రింట్ బయటికి వచ్చేసింది. జనాలు యథేచ్ఛగా మొబైళ్లలో.. కంప్యూటర్లలో సినిమా చూసేస్తున్నారు. ఐతే ప్రస్తుతం మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నది ఏమంత గొప్ప ప్రింట్ కాదు. క్వాలిటీ పేలవంగా ఉంది. ఐతే బీహార్లోని ఓ థియేటర్లలో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ద్వారా సినిమాను క్యాప్చర్ చేసిన ఒక ముఠా దాన్ని ఆన్ లైన్లో రిలీజ్ చేసేస్తామంటూ నిర్మాతలతో నేరుగా బేరం పెట్టింది. హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు శాంపిల్ వీడియో పంపించి.. బెదిరింపులకు దిగింది. ఐతే కరణ్ వాళ్లతో ఎలా డీల్ చేశాడో.. ఏం చేశాడో కానీ.. అలా బెదిరించిన గ్యాంగ్ మొత్తం ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది.
ఈ గ్యాంగును పట్టించడానికి తాను క్రిమినల్ మైండ్ వాడానని అంటున్నాడు కరణ్ జోహార్. ఈ గ్యాంగును పట్టుకోవడానికి తాను ఒక క్రిమినల్ లాగే ఆలోచించానని కరణ్ చెప్పాడు. మరో సినిమాను పైరసీ చేసినట్లు చెప్పి బెదిరించి ఉంటే తాను పెద్దగా పట్టించుకునే వాడిని కాదని.. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ లాంటి విజువల్ వండర్ ను పైరసీ చేశారనగానే తనకు చాలా కోపం వచ్చిందని.. అందుకే తన క్రిమినల్ మైండుతో వాళ్లను బుక్ చేశానని కరణ్ చెప్పాడు. ‘బాహుబలి’ లాంటి సినిమాను వెండి తెర మదే చూడాలని.. అప్పుడే గొప్ప అనుభూతి కలుగుతుందని.. ఇలాంటి సినిమాను పైరసీ చేయడం దారుణమని కరణ్ అభిప్రాయపడ్డాడు. ‘బాహుబలి’ రెండు భాగాలతో కలిపి కరణ్ జోహార్ ఓ వంద కోట్ల దాకా అయినా వర్కవుట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/