జాపనీస్ లో కి డైరక్ట్ డబ్బింగే!!

Update: 2017-05-02 13:13 GMT
సౌత్.. నార్త్ ఇప్పటి వరకు ఇండియా సినిమా ఈ రెండు దిక్కులు వైపే చూసింది. సౌత్ లో బాగా సక్సెస్ వస్తే ఉత్తరాదికి.. నార్త్ లో బాగా సక్సెస్ వస్తే దక్షణాదికి కి సినిమాలు వెళ్తాయి. ఇప్పుడిది ఒకప్పటి మాట అయిపోతోంది. బాహుబలి విడుదల తరువాత ఇండియా సినిమా పరిధి ఈస్ట్-వెస్ట్ కి కూడా పాకిపోతోంది. రాజమౌళి చేసిన మాయాజాలానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం..  సాహో బాహుబలి అంటున్నారు.

ఇప్పుడు బాహుబలి సినిమాను గేమ్సగా తయారుచేస్తున్నారు. ఒక ప్రముఖ ఛానల్..  బాహుబలిని టెలివిజన్ సీరియల్ గా మార్చేందుకు రెడీ అవుతోంది. మరి ఇంతటి ఘనవిజయం పొందిన సినిమా ప్రపంచ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి2ని  జపనీస్ లో డబ్బింగ్ సన్నాహాలు జరుగుతున్నాయి. జపనీస్ సబ్ టైటిల్స్ తో.. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు అక్కడ విడుదల అవుతాయి.   కానీ బాహుబలి2ని మాత్రం.. అక్కడి భాష లో డబ్బింగ్ చేసి విడుదల చేయనుండడం విశేషం.

ఇప్పటికే రాజమౌళి చైనీస్ లో విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడని అంటున్నారు. మన సినిమాలకు జపాన్ లో కూడా మార్కెట్ ఉండడంతో.. అక్కడ కూడా విడుదల చేసేయనున్నారు. జక్కన్న మూవీ మ్యాజిక్ కి.. ఇప్పుడు ప్రపంచం అంతా తన్మయత్వం పొందడం ఖాయమన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News