బాహుబలి నిజంగా దేశమంతటా పాపులర్ అయ్యిందా? అనే వారు ఇక ఈ దేశంలో ఎవ్వరు ఉండరేమో. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచంలో బాహుబలి సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. రాజమౌళి వేసిన ప్రణాళికలకు అందరు ఆకర్షితులయ్యారు. సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమా ప్రచారం ఓ రేంజ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇక మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాక అందరికి సినిమాలో లాజిక్ తెలుసుకోవాలని ఆసక్తి రేపింది.
మొత్తానికి బాహుబలి సెకండ్ పార్టీ 2017 ఏడాదికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని చెప్పాలి. రీసెంట్ గా గూగుల్ రిలీజ్ చేసిన.. 2017 టాప్ 10 సెర్చ్ సందేహాలలో బాహుబలి 2 కి మొదటి స్థానం దక్కింది. ఇండియాలో ఎన్నో అరుదైన విషయాలు చోటు చేసుకున్నప్పటికీ 2017 ఇండియన్ గూగుల్ రారాజుగా బాహుబలి నిలవడం గొప్ప విశేషమని చెప్పాలి. ఇప్పటికే ట్విట్టర్ - ఫెస్ బుక్ లాంటి సోషల్ మీడియా వ్యవస్థలో 2017లో ఎక్కవగా గుర్తింపు పొందినదిగా బాహుబలి నిలిచింది.
ఇక గూగుల్ లో కూడా ఆ గుర్తింపు దక్కడంతో టాలీవుడ్ జెండా జాతీయ స్థాయిలో బాలీవుడ్ తో సమానంగా ఎగురుతోంది అని చెప్పవచ్చు. మొన్నటి వరకు బాలీవుడ్ హీరోలు గురించి అలాగే వారి సినిమాలు ఇంకా క్రికెట్ వంటి వాటి విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేసేవారు. కానీ బాహుబలి కథ అందరిని ఆకర్షించడంతో పాటు బాక్స్ ఆఫీస్ రికార్డులను కూడా బద్దలు కొట్టడంతో అందరు ఈ సినిమా గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు.