రికార్డుల దాహం తీరదా

Update: 2018-01-06 08:07 GMT
సినిమా వచ్చి ఎనిమిది నెలలు దాటింది. టీవిలో ఇప్పటికే ఓ మూడు సార్లు వచ్చేసింది. యు ట్యూబ్ లో అఫీషియల్ గా హెచ్ డి వెర్షన్ అప్ లోడ్ కూడా చేసారు. కాని బాహుబలి 2 రికార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశ ఒక తెలుగు సినిమా గురించి ఇంత చర్చ ఎప్పుడూ జరగలేదు అనే స్థాయిలో ఉంది దీని ప్రభంజనం. వివిధ బాషల్లో సైతం జయ కేతనం వేసిన తెలుగు సినిమాగా బాహుబలికి ప్రత్యేక స్థానం చిరస్థాయిగా మిగిలిపోయింది. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన కత్తుల ఒరలో దాచుకున్న బాహుబలి మరో రికార్డు కూడా తన సొంతం చేసుకుంది. 2017లో పాపులర్ ఇన్ఫర్మేషన్ వెబ్ సైట్ వికిపీడియాలో ఎంటర్ టైన్ మెంట్ క్యాటగిరీలో అత్యధికంగా చదివిన ఆర్టికల్స్ లో బాహుబలి 2వ స్థానాన్ని దక్కించుకుని బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కు నెట్టేసింది.

 వికిపీడియాలోని మొత్తం క్యాటగిరీస్ ప్రకారం చూసుకుంటే బాహుబలి 11వ స్థానాన్ని దక్కించుకుంది. ఒక ప్రాంతీయ సినిమా ఇతర బాషలలో పునర్నిర్మాణం కాకుండా కేవలం ఒరిజినల్, డబ్బింగ్ వెర్షన్స్ తోనే ఇంత ఘనత సాధించడం అంటే చిన్న విషయం కాదు. నటీనటులు, సాంకేతిక వర్గం, రాజమౌళి వీళ్ళందరి ఐదేళ్ళ తపన, కృషి, పట్టుదల ఈ రోజుకీ ఫలితాన్ని ఇస్తూనే ఉంది. బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేంతలా సినిమా చరిత్రను తిరగరాసిన ఈ సెల్యులాయిడ్ వండర్ ఇంకెన్ని రికార్డులు కొట్టనుందో. అందుకే బాలీవుడ్ ను ఏలుతున్నాం అని గర్వంగా ఫీల్ అయ్యే ఖాన్ల ద్వయం బాహుబలి మీద ఈర్ష్యతో రగిలిపోయారు అని వచ్చిన వార్తల్లో నిజం ఉందనిపిస్తుంది.
Tags:    

Similar News