'బాహుబలి' అందాల బోల్డ్‌ స్కిన్ షో

Update: 2022-09-19 05:59 GMT
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో దూసుకు పోతున్న కెనడియన్ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ. ఈ అమ్మడు హిందీ సినిమాల ద్వారా ఇండియన్ వెండి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా కంటే ఎక్కువగా ప్రత్యేక పాత్రలు మరియు పాటలతో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లయినా కూడా కుమ్మేస్తూనే ఉంది.

బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా థాంక్యూ గాడ్‌ సినిమాలోని ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థాంక్యూ గాడ్‌ సినిమాలో సిద్దార్థ్‌ మల్హోత్ర కి జోడీగా ఒక దేవ కన్య మాదిరిగా కనిపించి అందాల ఆరబోతతో కుమ్మేసింది. ఈ అమ్మడి డాన్స్ మ్యాజిక్ మిస్ అయ్యిందనే విమర్శలు వచ్చినా కూడా ఓవరాల్‌ గా పాటకి మంచి మార్కులే పడ్డాయి.

ఈ అందాల ముద్దుగుమ్మ యొక్క బోల్డ్ స్కిన్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందాల విందు విషయంలో ఈ అమ్మడు ఎప్పుడు కూడా పొదుపు పాటించదు. తాజా ఫోటో షూట్ వీడియో కూడా అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. తప్పకుండా ఈ అమ్మడు మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో ఇదే రేంజ్ లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఒక వైపు ఐటెం సాంగ్స్ చేస్తున్న ఈ అమ్మడికి హీరోయిన్ గా కూడా ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా థాంక్యూ గాడ్‌ లోని దేవ కన్య లుక్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఉందేంటి బాబోయ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. ఈ వీడియోకి సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.




Tags:    

Similar News