బాహుబలి రిలీజైన వారానికి రిలీజైంది భజరంగి భాయిజాన్. రెండు సినిమాలు రికార్డుల్ని తిరగరాస్తూ వసూళ్ల వేట సాగించాయి. నెలరోజులు దాటింది. ఈ వేటలో ఇప్పటికీ అలసిపోలేదు. నాలుగు వారాల తర్వాత కూడా స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందు ముందుకి దూసుకెళ్తున్నాయి ఈ సినిమాలు. దేశంలో అత్యంత వేగంగా 50కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా బాహుబలి రికార్డ్ ఇప్పటికీ స్థిరంగానే ఉంది. ఈ సినిమా ఇప్పటికి 580కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి భజరంగి వెంట పడుతోంది.
సల్మాన్ కెరీర్ లో తొలి 300కోట్ల క్లబ్ సినిమా భజరంగి భాయిజాన్. మొదటివారంలోనే ఈ రికార్డ్ కొట్టేసింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 606కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇప్పటికీ స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. భజరంగి కంటే బాహుబలి రూ.25కోట్లు తక్కువలో ఉంది అంతే. రేసులో ఇప్పటికీ భాయిజాన్ ని బాహుబలి వెంబడిస్తూనే ఉన్నాడు. అయితే వీటి ఫేట్ ని నిర్ణయించేది రాబోవు సినిమాలే.
బ్రదర్స్, దృశ్యం, ఆల్ ఈజ్ వెల్ చిత్రాలు రిలీజైతే బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం పడుతుంది. ఆ మేరకు వసూళ్ల వేట నిలిచిపోతుందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.