బాహుబలి ది బిగినింగ్.. గత వారంలో చైనాలో భారీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాహుబలి అప్ డేట్స్ అంటే తెగ ప్రచారం పొందుతాయ్ కానీ.. గతవారం ఇక్కడి మార్కెట్ అంతా కబాలి మేనియాలో మునిగిపోయింది. దీన్నుంచి మెల్లగా ఇప్పుడు బయటపడే సమయానికి బాహుబలికి సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్ రిపోర్ట్స్ అందుతున్నాయి.
చైనాలో బాహుబలి మొదటి భాగం తొలి రెండు రోజుల్లో $5,40,000 వసూలు చేసింది. ఈ భారీ వసూళ్లతో చైనా బాక్సాఫీస్ లో 9వ స్థానంలో నిలిచాడు బాహుబలి. ఏరకంగా చూసినా ఒక ఇండియన్ మూవీకి చైనాలో ఈ మొత్తం అంటే భారీ సక్సెస్ అనే అంటున్నారు. ప్రస్తుతానికి రిపోర్టులు కూడా పాజిటివ్ గా ఉండడంతో.. ఈ కలెక్షన్స్ స్టడీగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఒరిజినల్ తో పోల్చితే.. చైనీస్ వెర్షన్ ను 20 నిమిషాల పాటు కోత వేసి, మరింత క్రిస్పీగా క్యాచీగా రూపొందించారు.
చైనాలో 5వేలకు పైగా స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1 పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. వీటిని అందుకోవడంలో బాహుబలి ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం రెండో భాగానికి సంబంధించిన క్లైమాక్స్ పనుల్లో ప్రధాన యూనిట్, దర్శకుడు నిమగ్నమై ఉన్నారు. కేవలం క్లైమాక్స్ చిత్రీకరణకే 30 కోట్ల బడ్జెట్ ను కేటాయించారంటే.. బాహుబలి 2 పై ఏ స్థాయి అంచనాలున్నాయో అర్ధమవుతుంది.