జర్మన్ లో ఫెయిలైనా ఫ్రాన్స్ లో హిట్టే

Update: 2016-06-17 05:30 GMT
బాహుబలి ది బిగినింగ్ సంచనలాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే అంచనాలున్నా.. అంచనాలకు మించి ఈ మూవీ సాధించిన విజయం అసామాన్యం. ఇండియాతో పాటు అనేక దేశాల్లో ఈ చిత్రం రికార్డులు సాధిస్తూనే ఉంది. గత నెలలో జర్మన్ వెర్షన్ బాహుబలి ఫెయిల్యూర్ కావడంతో.. మిగిలిన దేశాల రిజల్ట్ పై అనుమానాలు తలెత్తాయి.

త్వరలో చైనా విడుదలకు  సిద్ధమవుతున్న బాహుబలి టీంకి ఇప్పుడో గుడ్ న్యూస్ వచ్చింది. ఫ్రాన్స్ లో గత వారం రిలీజ్ అయిన బాహుబలి ది బిగినింగ్.. అక్కడ అంచనాలకు మించి విజయం సాధిస్తోంది. రెండో వారంలో ఇంకా స్క్రీన్లు పెంచే పరిస్థితి తలెత్తిందంటే.. ఫ్యాషన్ డెస్టినేషన్ జనాలు బాహుబలి ఎపిక్ డ్రామాకు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ కు - మన హీరో ఫిజిక్ కు పారిస్ జనాల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

రెండో వీకెండ్ కి కూడా ఇప్పటికే హౌజ్ ఫుల్స్ పడిపోయాయంటే.. బాహుబలి క్రేజ్ అర్ధమవుతుంది. మొదటి స్క్రీనింగ్ కే విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు. 14మంది ఉండే ఆడిటోరియం మొత్తం.. సినిమా అయిపోయాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం ఎంతైనా ప్రశంసించాల్సిన విషయం. రెండో భాగం రిలీజ్ రెడీ అయ్యేలోపు.. బాహుబలి మిగిలిన దేశాల్లో కూడా  సెన్సేషన్స్ సృష్టించడం రియల్లీ గ్రేట్ అంతే.
Tags:    

Similar News