బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పాకితే.. ఇప్పుడు సినిమా కూడా దేశాలు దాటనుంది. ఇప్పుడు మన బాహుబలి చైనాలో భారీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏకంగా ఆరు వేల ప్రింట్లతో చైనా మొత్తంలో జక్కన్న సినిమా ప్రదర్శితం కానుంది. ఈ-స్టార్ ఫిలింస్ అనే సంస్థ చైనాలో బాహుబలిని విడుదల చేస్తోంది.
గతంలో అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రాన్ని కూడా ఇదే సంస్థ చైనాలో విడుదల చేసింది. అక్కడ కూడా భారీ హిట్ కొట్టిన పీకే.. 20మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు బాహుబలిపై అంతకంటే ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. అందుకే స్క్రీన్ల పరంగా చూసుకున్నా.. పీకే కంటే పెద్ద రేంజ్ లో మే నెల చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చైనాలో కూడా బాహుబలి భారీ సక్సెస్ అయ్యే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కనుక.. పీకే రేంజ్ వసూళ్లను సాధించగలిగితే.. భారీ వసూళ్ల జాబితాలో ఇండియాలో అతి పెద్ద సినిమాగా బాహుబలి నిలిచే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ చిత్రాన్ని 30కి పైగా దేశాల్లో అమ్మకాలు చేశారు. ఇందులో లాటిన్ అమెరికా జపాన్ లు కూడా ఉన్నాయి. రీసెంట్ గా జర్మనీలో విడుదల చేసేందుకు స్ప్లెండిడ్ బాహుబలి హక్కులను దక్కించుకుంది. అయితే.. బాహుబలికి తెలుగు వెర్షన్ కు సంబంధించిన అంతర్జాతీయ హక్కులను.. ఆర్కా మీడియా ఇంటర్నేషనల్ చూసుకుంటోంది.