బాహుబలి-2.. అరవోళ్ల అతి చూశారా?

Update: 2017-05-08 09:46 GMT
ఇండియాలో సినిమాల ప్రభావం బాగా ఉండేది సౌత్ ఇండియాలోనే. ఈట్ సినిమా.. డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమా అన్నట్లే ఉంటుంది మనోళ్ల వ్యవహారం. అందులోనూ తమిళ జనాలైతే ఈ విషయంలో కొన్ని అడుగులు ముందే ఉంటారు. కొత్త సినిమాలు రిలీజైనపుడు పాలాభిషేకాలు చేయడాలు.. థియేటర్లలో స్క్రీన్ ముందు హారతులు పట్టడాలు లాంటివి మొదలుపెట్టింది అరవోళ్లే. ఈ మధ్య వాళ్లు మరీ శ్రుతి మించిపోయి తమ అభిమాన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదైనా రిలీజవ్వగానే దాన్ని ఫ్లెక్సీ వేసి కొబ్బరి కాయలు కొట్టడాలు.. పూజలు చేయడాలు లాంటివి కూడా చేస్తున్నార. ఈ జాఢ్యం నెమ్మదిగా తెలుగు అభిమానులకు కూడా సోకుతోంది.

తాజాగా అరవ జనాల అతికి నిదర్శనంగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక జంట పెళ్లి చేసుకుంటే.. వాళ్లను బాహుబలిలో ప్రభాస్-అనుష్క కలిసి బాణాలు విసిరే పోజులో నిలబెట్టేసి ఒక ఫ్లెక్సీ రెడీ చేశారు వారి సన్నిహితులు. ప్రభాస్ ముఖం తీసి అబ్బాయిది.. అనుష్క ఫేస్ తీసి అమ్మాయిది పెట్టేసి వాళ్లకు వివాహ శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అతి తమిళ జనాలకు మాత్రమే సాధ్యం అని సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఐతే తెలుగు నుంచి డబ్ అయిన సినిమా తమిళ జనాలపై ఎంతగా ప్రభావం చూపుతోందో చెప్పడానికి ఇది రుజువు. బాహుబలి మేనియాతో ప్రస్తుతం తమిళనాడు అంతా ఊగిపోతోంది. అక్కడ ఈ సినిమా రూ.150 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News