83కోట్ల షేర్‌ అంటే ఆషామాషీనా?

Update: 2015-06-25 05:18 GMT
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి రిలీజ్‌కి ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ట్రేడ్‌ పండితుల విశ్లేషణ ప్రకారం ఈ సినిమా బిజినెస్‌ రికార్డు స్థాయిలో సాగింది. ఇప్పటికే కేవలం తెలుగు మార్కెట్‌ని విశ్లేషిస్తే.. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఓవర్సీస్‌ కలుపుకుని అన్ని ఏరియాల పంపిణీదారుల నుంచి 83కోట్లు (థియేటర్లకు పంపిణీ రూపంలో) టేబుల్‌ మీదికి వచ్చింది.

నైజాం 22.5కోట్లు, ఆంధ్రా 30కోట్లు, సీడెడ్‌ 12.6కోట్లు, కర్నాటక 8.6కోట్లు, ఓవర్సీస్‌ నుంచి 9కోట్లు .. బిజినెస్‌ సాగింది. కర్నాటకలో అగ్రనిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో పెట్టుబడుల్ని రికవరీ చేయడం అంటే ఆషామాషీనా.. 83కోట్ల షేర్‌ వసూళ్లు సాధించడం అంటే ఆషామాషీ కాదు. ఇంతవరకూ అత్తారింటికి దారేది పేరిట 74.88కోట్ల రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానంలో మగధీర 73.6కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ రికార్డులన్నిటినీ బాహుబలి తుడిచేసి సరికొత్త రికార్డుల్ని ఆవిష్కరిస్తేనే పంపిణీదారులకు తిరిగి డబ్బులొచ్చినట్టు. లేదంటే ఇక నిద్రలేని రాత్రులే. బాహుబలి దుందుడుకు బాక్సాఫీస్‌ వద్ద కుదురుతుందా? కుదరకపోతే పరిస్థితేంటి? అన్నదే ఇప్పుడు అందరిలోనూ హాట్‌ టాపిక్‌.

Tags:    

Similar News