‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయినప్పటికీ తమకు లాభం ఏమీ రాలేదని అన్నాడు నిర్మాత శోభు యార్లగడ్డ. హీరో ప్రభాస్ సైతం ఇదే మాట చెప్పాడు. ఈ మొత్తంలో బయ్యర్లు.. ఎగ్జిబిటర్లు ఎంత మిగుల్చుకున్నప్పటికీ.. నిర్మాతలకు అసలు లాభమే రాలేదని అనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘బాహుబలి: ది బిగినింగ్’ కోసం భారీగా ఖర్చు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమాకు హైప్ కూడా మామూలుగా రాలేదు. బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. తొలి భాగం పూర్తయ్యే సమయానికే ఈ సినిమాకు రూ.100 కోట్ల దాకా లాభం వచ్చినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.
‘బాహుబలి’ రెండు భాగాలకు కలిపి అనుకున్న బడ్జెట్ రూ.250 కోట్లు. తొలి భాగం పూర్తి చేసే సమయంలోనే రెండో భాగానికి సంబంధించి కూడా 40 శాతం షూట్ పూర్తయింది. అప్పటికి నిర్మాతలు రూ.150 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఉంటారని అంచనా వేశారు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు ముందు ప్రెస్ మీట్లో నిర్మాత బడ్జెట్ ను రూ.450 కోట్లకు పెంచి చెప్పాడు. రెండో భాగానికి వచ్చేసరికి ఎక్కువ ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ లభించినప్పటికీ.. బడ్జెట్ ఒక్కసారిగా 80 శాతానికి పైగా పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తొలి భాగానికి ఎంత భారీగా వడ్డీలు కట్టి ఉన్నా.. ఈ సినిమాకు సంపూర్ణ సహకారం అందించిన రామోజీరావుకు లాభాల్లో వాటా ఇచ్చి ఉన్నా.. నిర్మాతలకు ఏమీ మిగల్లేదనడం మాత్రం నమ్మశక్యం కాని విషయమే. మరి ‘బాహుబలి-1’ వసూలు చేసిన రూ.600 కోట్లు ఏమైనట్లో అర్థం కావడం లేదు. బాహుబలి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయో ఏమో కానీ.. తమ మీద ఆదాయపు పన్ను అధికారుల కళ్లు పడ్డ నేపథ్యంలో నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే పైసా లాభం రాలేదని చెబుతున్నారేమో అన్న సందేహాలు లేకపోలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/