బాహుబలి లాభాల లెక్కలు ఏంటంటే..

Update: 2017-03-17 05:19 GMT
బాహుబలి ది బిగినింగ్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన మూవీ. మొత్తంగా 600 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన బాహుబలి పార్ట్ 1కి.. లాభాలు రాలేదంటే ఆశ్చర్యం వేయక మానదు. అయితే.. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అప్పటి ఇండస్ట్రీ రికార్డులకు మించిన రేట్లకే విక్రయించారు. అయితే.. మొదటి భాగానికి పెట్టిన ఖర్చు కంటే వచ్చిన ప్రొడ్యూసర్ కాసింత తక్కువే అనే వాదన ఉంది.

ఇప్పుడదే వాస్తవం అంటున్నారు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ. మొత్తంగా రెండు భాగాలకు కలిపి 450 కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్నారీయన. మొదటిపార్ట్ 150-200 కోట్ల వరకూ ఖర్చు కాగా.. రెండో పార్ట్ లో ఫైట్స్+గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో.. మరింతగా ఖర్చు పెరుగుతోంది. తొలి భాగానికి తాము లాభాలు అందుకోలేదని.. బాహుబలి ది కంక్లూజన్ తమకు ఆ లోటు తీర్చనుందని చెబుతున్నారు.

బాహుబలి ది కంక్లూజన్ కు ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో 500 కోట్ల రూపాయల వ్యాపారం చేయడంతో.. కచ్చితంగా లాభాల్లోకి వచ్చేసినట్లు అయింది. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో సృష్టిస్తున్న రికార్డులు.. ట్రైలర్లో కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే.. 1000 కోట్ల వసూళ్లు సాధించబోయే తొలి ఇండియన్ మూవీ ఇదే అనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News