బాహుబలి సినిమాలో ప్రభాస్ హీరో.. రానా దగ్గుబాటి విలన్.. సత్యరాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇంకా చాలామంది నటులు చాలా రకాల పాత్రలు వేశారు. ఐతే వీళ్లందరిలోనూ కామన్ గా కనిపించే ఒక అంశం ఉంది. అదే.. గడ్డం. సినిమాలో ప్రధాన పాత్రధారులు చాలామందికి గడ్డాలుంటాయి. కానీ ఒక్కొక్కరి గడ్డం ఒక్కోలా ఉంటుంది. బాడీల మీద పెట్టిన శ్రద్ధే ఈ గడ్డాల మీద కూడా పెడుతున్నారు బాహుబలి యూనిట్ సభ్యులకు. వీళ్లందరిలో స్ఫూర్తి నింపడానికో ఏమో కానీ.. రాజమౌళి సైతం గడ్డంతో కనిపిస్తున్నాడు. మరి ఇంత మంది గడ్డాలు పెంచుతున్నపుడు.. నిర్మాతలు ఆ గడ్డాల కోసం ఏదో ఒకటి చేయాలి కదా.
శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని అదే చేశారు. గడ్డం వీరుల కోసం ప్రసిద్ధి చెందిన ‘బియర్డో’ బ్రాండుకు చెందిన ఒక స్పెషల్ కిట్ ను యూనిట్ లో గడ్డాలు పెంచుతున్న ఒక్కొక్కరికి గిఫ్టుగా ఇచ్చారు. ఇందులో బియర్డ్ ఆయిల్ - వ్యాక్స్ లతో పాటుగా గడ్డం పోషణకు ఉపయోగపడే సామగ్రి ఉంటాయి. ఈ కాస్ట్లీ గిఫ్టును యూనిట్ లోని గడ్డం వీరులందరికీ పంచి పెట్టారు శోభు - ప్రసాద్. బాహుబలికి సంబంధించి ఏ చిన్న విశేషం అయినా.. పెద్ద వార్తే కాబట్టి ఆటోమేటిగ్గా ఇది పబ్లిసిటీకి కూడా ఉపయోగపడుతుందనుకోండి. ప్రస్తుతం ప్రధాన తారాగణమంతా షూటింగులో పాల్గొంటుండగా.. ఫస్ట్ పార్ట్ కంటే వేగంగా రెండో భాగం షూటింగ్ కానిస్తున్నాడట రాజమౌళి. అక్టోబరుకల్లా షూటింగ్ పూర్తి చేయాలన్నది జక్కన్న ప్లాన్. 2017 ఏప్రిల్ 14న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.