"బాహుబలి ది బిగినింగ్" పేరులోనే బిగినింగ్ ఉన్న బాహుబలి రికార్డులకు ఎండింగ్ మాత్రం కనిపించడం లేదు. ఓ తెలుగు సినిమాగా షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ.. ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీ అయిపోయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీస్ లో.. టాప్ 2 స్థానాన్ని ఆక్రమించింది బాహుబలి.
ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లలో సత్తా చాటాడు జక్కన్న. ఇపుడు లాటిన్ అమెరికాపై గురిపెట్టాడు. బాహుబలి ది బిగినింగ్ కి సంబంధించిన అన్ని లాటిన్ అమెరికా హక్కులను సన్ డిస్ట్రిబ్యూషన్ కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 4,500 స్క్రీన్స్ లో ఇప్పటికే రిలీజ్ అయిన బాహుబలి.. ఇప్పుడు మరిన్ని మార్కెట్లలో విడుదలకు రెడీ అవుతోంది.
తైవాన్, కొరియా, ఆగ్నేయ ఆసియయా దేశాలు, చైనా మార్కెట్లలో బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ కి సంబంధించిన డీల్స్ పూర్తయ్యాయి. ఇంకా యూరోప్ మార్కెట్లో ఈ వెర్షన్ కి సంబంధించిన రైట్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే.. అంతర్జాతీయ వెర్షన్ రిలీజ్ ను రిలీజ్ చేయనున్నారు. తొలి భాగాన్ని ఇలా పలు మార్కెట్లలో విడిగా రిలీజ్ చేసినా.. ఫైనల్ పార్ట్ ని మాత్రం ఏకకాలంలో విడుదల చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.