‘బాహుబలి: ది బిగినింగ్’లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సన్నివేశాల్లో భల్లాలదేవుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించే సీన్ ఒకటి. ఎంతో భారీతనంతో కూడుకున్న ఆ సీన్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఉత్కంఠభరిత రీతిలో ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు రాజమౌళి. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’లో దాన్ని తలదన్నే సీన్ ఉంటుందట. భల్లాలదేవుడి కంటే భారీ స్థాయిలో బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్టించే సన్నివేశం రెండో భాగంలో ఉంటుందట.
‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్లో జనాలందరూ కళ్లు విచ్చుకుని ఆశ్చర్యంగా చూసే షాట్ ఒకటి గమనించే ఉంటారు. బాహుబలి భారీ విగ్రహం కొలువుదీరే క్రమంలో జనాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నపుడు ఇచ్చిన హావభావాలే అవి అని అంటున్నారు. ఈ సీన్ సినిమాలో చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. మరోసారి ప్రేక్షకులకు ఎమోషనల్ హై ఇవ్వడానికి విగ్రహం సీన్ పెట్టాడట రాజమౌళి. ఐతే ఒకసారి చూసిన సన్నివేశాన్నే రెండోసారి మరో రకంగా చూస్తే ప్రేక్షకులు ఏమంత థ్రిల్ అవుతారో అన్నది డౌట్. ది కంక్లూజన్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సినిమాలో ఏం తక్కువైనా ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. మరి జక్కన్న ప్రేక్షకుల అంచనాల్ని ఏమాత్రం అందుకుంటాడో.. వారిని ఏమేరకు సంతృప్తి పరుస్తాడో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/