మామూలుగా రాజమౌళి తీసిన మగధీర సినిమాను చూసి.. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ 300 సినిమాలో సీన్లే కదా అని విమర్శించిన వారు లేకపోలేదు. అందుకు తగ్గట్టే రాజమౌళి కూడా సదరు హాలీవుడ్ సినిమా నుండి బీభత్సంగా ఇన్స్‌పయర్ అయ్యాడు. ఇదే విషయంగా స్వయంగా చాలాసార్లు చెప్పాడు కూడా. అయితే ఇప్పుడు జక్కన్న తీసిన ''బాహుబలి'' 300 కంటే గ్రేట్ అంటున్నారు జనాలు. హౌజ్ దిస్ పాజిబుల్? పదండి చూద్దాం.
ప్రఖ్యాత హాలీవుడ్ రేటింగుల వెబ్‌సైట్ ఐ.యం.డి.బి. ఉంది చూశారూ.. అందులో బాహుబలి సినిమాకు ప్రస్తుతం బీభత్సమైన రేటింగ్ కనిపిస్తోంది. సాలిడ్‌గా 9.5 రేటింగ్‌తో ఈ సినిమా నడుస్తోంది. అయితే 300 సినిమాకు మాత్రం కేవలం 7.8 రేటింగ్ మాత్రమే ఉంది. ఆ లెక్కన చూస్తే 300 సినిమాను బాహబలి బీట్ చేసేసినట్లే మరి అంటూ ఇప్పుడు ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు సంబరపడుతున్నారు. నిజంగానే గర్వపడాల్సిన విషయమే కాని.. ఈ రేటింగ్‌ను చూసుకుంటూ 300 సినిమాకంటే మనం అద్భుతమైన సినిమాను తీశాం అనుకోవడం మాత్రం తప్పేనేమో. ఎందుకంటే ఆ సినిమా రేంజే చాలా డిఫరెంట్ అని మనం వేరే చెప్పక్కర్లేదు. అది సంగతి.