ట్రెడిషనల్ టచ్‌తో కుషిత క్యూట్ లుక్స్

"మైన్ & యోర్స్ వెడ్డింగ్ షో" ఈవెంట్ బ్యాక్ డ్రాప్ ముందు దిగిన ఫోటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటూ ఉన్నాయి.

Update: 2024-11-15 14:30 GMT

 కుషిత కల్లపు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న హీరోయిన్. ఇక రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్సులోని ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె స్మైలింగ్ ఫేస్, ట్రెడిషనల్ జువెలరీ, క్యూట్ లుక్స్ నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. "మైన్ & యోర్స్ వెడ్డింగ్ షో" ఈవెంట్ బ్యాక్ డ్రాప్ ముందు దిగిన ఫోటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటూ ఉన్నాయి.

బ్లాక్ డ్రెస్ లో ఆమె ట్రెడిషనల్ లుక్ కలగలిసిన ఈ ఫోటో ఆమె అందాన్ని హైలైట్ చేస్తోంది. కుషిత తన సినీ ప్రస్థానంలో తొలుత యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వెబ్ సిరీస్ లలో నటిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన టాలెంట్ తో పాటు, సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ తో విపరీతమైన ఫాలోయింగ్ అందుకుంది. వీటిలో క్యూట్ లుక్స్ ఎక్స్ ప్రెషన్స్ యువతలో ఆమెకు మంచి క్రేజ్ తెచ్చాయి.

"చాంగురే బంగారురాజా" అనే సినిమాలో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కుషిత, తన ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమా తరువాత "మనోహరం", "నీతోనే నేను" వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. అర్జున్ కళ్యాణ్ తో కలిసి నటించిన "బాబు నెంబర్ వన్ బుల్ షిట్" సినిమాలోనూ ఆమె గ్లామర్ రోల్ లో కనిపించింది.

అంతేకాకుండా కుషిత తన గ్లామర్ ఫోటోషూట్లను ఇన్ స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్ గా షేర్ చేస్తూ, యూత్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజా ఫోటోల్లో ఆమె ట్రెడిషనల్ డ్రెస్సులో, కంటెంట్ ఫుల్ లుక్స్ తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుండి మంచి స్పందన పొందుతోంది. అభిమానులు ఆమె క్యూట్ లుక్స్ పై మెస్మరైజ్ అవుతున్నారు. ఇక వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ, తన గ్లామర్ అండ్ టాలెంట్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో కుషిత మంచి గుర్తింపు సాధించాలని ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News