డిస్నీ లెవెల్లో దోచుకోవాలనే వీళ్ళ ప్లాన్

Update: 2016-10-01 17:30 GMT
ఇప్పటివరకు ఇండియాలో ఒక సినిమా వచ్చిందంటే.. దాని చుట్టూ జరిగే మర్చెండైజింగ్ చాలా తక్కువ. ఎందుకంటే మన సినిమాలన్నీ కేవలం హీరో తాలూకు ఇమేజ్ - హీరోయిన్ తాలూకు గ్లామర్ - కథలోని సెంటిమెంట్ చుట్టూతానే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది కాని.. అసలు థీమ్ బేస్డ్ సినిమాలే ఉండవు. అలాంటి వాదనకు ఫుల్ స్టాప్ పెడుతూ ''బాహుబలి'' ఒక్కసారిగా మనకు హాలీవుడ్ రేంజ్ టచ్ చూపించాడంతే.

అందుకే ఇప్పుడు రాక రాక వచ్చిన అవకాశం కాబట్టి.. బాహుబలి సినిమాను ఎన్ని విధాలుగా క్యాష్‌ చేసుకోవాలో అన్ని విధాలుగా క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి కామిక్ బుక్స్ అంటూ రెడీ చేసేశారు. అలాగే ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా బాహుబలి యానిమేటెడ్ సిరీస్ ను రంగంలోకి దించారు. త్వరలోనే బాహుబలి నిర్మాత స్వయంగా వర్చువల్ రియాల్టీ వీడియోలను కూడా తెస్తున్నారు. చూస్తుంటే కొద్ది రోజులు నార్మల్ బాహుబలి టీ-షర్టులు కాకుండా.. అసలు బాహబలి కత్తులూ డ్రస్సులూ పిల్లల కోసం మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగే ప్లే స్టేషన్లో ఆడుకునే బాహుబలి గేమ్ కూడా వచ్చే ఛాన్సుందట.

నిజానికి ఇదంతా హాలీవుడ్ లో డిస్నీ వంటి సంస్థలు ఎప్పటినుండో చేస్తున్నపనే. ఏదన్నా ఒక కార్టూన్ లేదా ఫ్యాంటసీ సినిమా వచ్చిందనుకోండి.. వెంటనే దానిపై కామిక్స్ - యానిమేటెడ్ సిరీస్ - మెర్చండైజ్ - బట్టలు - కీ చైన్లు.. ఇలా రకరకాల ప్రొడక్టులు రంగంలోకి దిగిపోతాయి. సినిమా 1000 కోట్లు వసూలు చేస్తే.. ఈ మర్చండైజ్ పై దాదాపు ఒక 400 కోట్లు వసూళ్ళు వస్తుంటాయి. ఇప్పుడు బాహుబలి కూడా ఇదే రేంజులో దోచుకోవడానికి సిద్దమవుతోంది మరి. అదేలేండి.. మనస్సుతో పాటు పర్సు కూడా దోచుకుంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News