ఏప్రిల్ 7న బాహుబ‌లి విడుద‌ల‌

Update: 2017-04-01 04:11 GMT
అదేంటి ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్’ రిలీజ్ ఏప్రిల్ 28న క‌దా.. మొన్న‌నే డేట్ మ‌రోసారి క‌న్ఫ‌మ్ చేశారు క‌దా.. ఉన్న‌ట్లుండి ఈ ప్రిపోన్మెంట్ ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఏడో తారీఖున రిలీజ‌వుతున్న‌ది ‘ది కంక్లూజ‌న్’ కాదు. ‘ది బిగినింగ్’. అవును బాహుబ‌లి మొద‌టి భాగాన్ని ఏప్రిల్ 7న మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు.

‘ది కంక్లూజ‌న్’ విడుద‌ల‌కు ముందు బ‌జ్ మ‌రింత పెంచేందుకు దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఐతే ఇలా రిలీజ‌వుతున్న‌ది హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే. తొలి భాగం విడుద‌లైన స‌మ‌యంలో హిందీ వెర్ష‌న్ జ‌నాల్లోకి వెళ్ల‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది ఈ లోపు సినిమా కొన్ని చోట్ల ఖాళీ అయిపోయింది. ఆ త‌ర్వాత ప్రేక్ష‌కులు చాలామంది టీవీల్లో.. ఇంట‌ర్నెట్లో సినిమా చూశారు. అలాంటి ప్రేక్ష‌కులు ‘ది కంక్లూజ‌న్’ కంటే ముందు ఒక‌సారి ‘ది బిగినింగ్‌’ను వెండితెర‌పై చూసుకుని.. రెండో భాగానికి త‌గ్గ ఎగ్జైట్మెంట్ తెచ్చుకుంటార‌ని భావిస్తున్న‌ట్లున్నాడు క‌ర‌ణ్ జోహార్. ఈ నిర్ణ‌యం ఆయ‌న‌దేన‌ట‌.

ఏఏ ఫిలిమ్స్ దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతోంది. ఒక కొత్త సినిమా స్థాయిలో ‘బాహుబ‌లిః ది బిగినింగ్‌’ను రిలీజ్ చేస్తార‌ట‌. బాహుబ‌లి-2 రిలీజ్ ఏప్రిల్ 7 న రాబోయే కొత్త సినిమాల‌పై కొంత మేర ప్ర‌భావం చూపుతుంద‌ని భావిస్తున్నారు. ‘ది బిగినింగ్’ రీ రిలీజ్ తో ‘ది కంక్లూజ‌న్’ మీద హైప్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News