బాహుబలి చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రపంచ దేశాల్లో గొప్ప ప్రశంసలొస్తున్నాయి. నిపుణులంతా ఈ సినిమా విజువల్స్ ని అసాధారణంగా పొగిడేస్తున్నారు. ముఖ్యంగా ఆ వాటర్ ఫాల్స్, యుద్ధ సన్నివేశాల్లో విజువల్స్, భారీ అడవి దున్నతో పారాటం.. ఇవన్నీ విఎఫ్‌ఎక్స్ లో క్రియేట్ చేసినవే. అయితే వీటన్నిటి వెనక ఓ క్రియేటివ్ బ్రెయిన్ ఉంది. అతడే శ్రీనివాస్ మోహన్. రాజమౌళి వెంటే ఉండి మూడేళ్ల పాటు నిరంతరాయంగా దేశ విదేశాలు తిరుగుతూ వి ఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేశారాయన.
ఇంకా చెప్పాలంటే ఈయన రెండో రాజమౌళి అంటే తప్పేమీ లేదు. మగధీర, ఈగ చిత్రాల నుంచి అతడి హవా మొదలైంది. రాజమౌళి తో అలయెన్స్ అయినప్పట్నుంచి లక్ష్యం కోసం ఎంతో శ్రమించారు. అతడి నేపథ్యం గురించి తెలుసుకుంటే ఎంతో ఆసక్తి కలుగక మానదు. వాస్తవానికి శ్రీనివాస్ తొలుత ఓ లారీ క్లీనర్ గా పనిచేశాడు. తర్వాత బోలెడన్ని ఉద్యోగాలు చేశాడు. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్ డిపార్ట్‌మెంట్ లో పనిచేస్తున్నాడు. ఇదంతా ప్రణాళికాబద్ధమైన జీవితంతోనే సాధ్యమైందని శ్రీనివాస్ చెబుతున్నారు. కృషి, పట్టుదల ఉంటేనే మనుషులు రుషులవుతారు అనడానికి ఈయనే నిదర్శనం.