సౌత్ ఇండియా వాళ్లంటే నేషనల్ మీడియాకు చాలా చిన్నచూపు. అందులోనూ తెలుగోళ్లంటే మరీను. నార్త్ లో ఇద్దరో ముగ్గురో చనిపోయినా బోలెడంత హంగామా చేసే నేషనల్ మీడియా మన తెలుగునాట పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనకు కూడా పెద్దగా ప్రాధాన్యమివ్వదు. సినిమాల విషయంలో అయితే ఈ వివక్ష మరీ ఎక్కువ. మన సినిమాల సంగతులు అక్కడి మీడియాలో ఎప్పుడూ కనిపించవు. కానీ బాహుబలి విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తమ ఛానెళ్లలో పత్రికల్లో కచ్చితంగా ఈ సినిమా విశేషాలకు చోటివ్వాల్సిన పరిస్థితి.
సినిమా విడుదలకు ముందు రాజమౌళి అండ్ కో మీడియా వాళ్లను పిలిచి ప్రమోషన్ చేస్తే.. ఇప్పుడు మీడియా వాళ్లే బాహుబలి టీమ్ కోసం ఎగబడుతున్నారు. ఆ స్థాయిలో నార్త్ ఇండియాలో ప్రభంజనం సృష్టిస్తోంది బాహుబలి. తొలి వారంలో బాహుబలి హిందీ వెర్షన్ యాభై కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం.. భారతీయ చలన చిత్ర రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ వెళ్తుండటంతో బాహుబలి టీంతో చిట్ చాట్ కోసం అక్కడి మీడియా వాళ్లు ఎగబడుతున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు రాజీవ్ మసంద్.. రాజమౌళి, రానా, ప్రభాస్‌ల ను పిలిచి షో చేశాడు.
ఇంకా కొన్ని ఛానెళ్లు, పత్రికల్లో బాహుబలికి సంబంధించిన విశేషాలు కనిపిస్తున్నాయి. బాహుబలి ప్రభంజనం మీద ప్రముఖ పత్రికల్లో కార్టూన్లు కూడా ప్రచురితమవుతుండటం విశేషం. బాహుబలి వెర్సస్ భజరంగి భాయిజాన్.. బాహుబలి వెర్సస్ ఖాన్ త్రయం.. ఇలా రకరకాల కాన్సెప్టులతో కార్టూన్లు తయారవుతున్నాయి. మన సినిమాను నార్త్ వాళ్లు ఈ స్థాయిలో గుర్తించడం నభూతో అని చెప్పాలి.